వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోయిననూ రాదు ఇటువంటి మంచి తరుణం... అందుకే గట్టి పట్టు... అంటున్న జనసేనాని

|
Google Oneindia TeluguNews

రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల‌నుకుంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ‌ను మాత్రం రూపొందించుకోలేక‌పోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా అవ‌స‌ర‌మైతే పొత్తుల‌కు సిద్ధ‌మంటూ పార్టీ ఆవిర్భావ స‌భ‌లోనే ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఇరుపార్టీల మ‌ధ్య పొత్తుల‌పై అన‌ధికారిక చ‌ర్చ‌లైతే జ‌రుగుతున్నాయికానీ అవి ఒక కొలిక్కి రావ‌డంలేదు.

40 నియోజకవర్గాలు చాలు

40 నియోజకవర్గాలు చాలు

ఈసారి ఎన్నిక‌ల్లో అధికారం పంచుకోవ‌డం, లేదంటే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌డం అనే రెండు ల‌క్ష్యాల‌తో జ‌న‌సేన ఉంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల‌క‌న్నా పార్టీ ఎక్క‌డైతే గెల‌వ‌గ‌లుగుతుంది? గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ ఓట్లు వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాలు? త‌న‌కు బ‌ల‌మున్న స్థానాలు? వంటి అంచ‌నాల‌తో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక రూపొందించుకుంటోంది. కేవ‌లం 30 నుంచి 40 నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టిసారించి వాటిని కైవ‌సం చేసుకుంటే చాలు.. తానే కింగ్ మేక‌ర్ అవుతాన‌ని ప‌వ‌న్ కల్యాణ్ భావిస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

అత్యాశ కూడదంటున్న సీనియర్ రాజకీయవేత్తలు

అత్యాశ కూడదంటున్న సీనియర్ రాజకీయవేత్తలు

నిల‌బ‌డ్డ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మిపాలై, ఒక్క సీటును మాత్ర‌మే ద‌క్కించుకొని తర్వాత జరిగే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌డితే అద్భుత‌మేన‌ని, కానీ అత్యాశ‌కు వెళ్ల‌కూడ‌దంటూ కొంద‌రు హిత‌బోధ చేస్తున్నారు. అక్టోబ‌రు నుంచి చేప‌ట్టే బ‌స్సుయాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకుంటామ‌ని, నిల‌బ‌డ‌తామ‌ని జనసేనాని భావిస్తున్నారు. పార్టీ సీట్లు గెలవాలన్నా, బలోపేతం కావాలన్నా, పదవి చేపట్టాలన్నా ఇదే మంచి తరుణమని, ఇటువంటి సందర్భాన్ని వదులుకుంటే ఎప్పటికీ బలోపేతం కాలేమనే యోచనలో తమ నేత ఉన్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

ఒంటరి పోటీ... వీలైనన్ని స్థానాలు

ఒంటరి పోటీ... వీలైనన్ని స్థానాలు

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి వీలైనన్ని స్థానాలు దక్కించుకోవాలనేది జనసేన ప్రణాళికగా ఉంది. పొత్తులపై తెలుగుదేశం పార్టీ కూడా ఏమీ స్పందించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏ నియోజకవర్గాల్లో పోటీచేయాలనేది ఇప్పటికే నిర్ణయించారు. అందులో ఉభయ గోదావరి జిల్లాలు ముఖ్యమైనవి.

ఈ రెండు జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాలన్నింటిలో పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనప్పటికీ జనసేనాని మాత్రం తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉండటం ఆ పార్టీ శ్రేణులను ఆనందానికి గురిచేస్తోంది.

English summary
Jana Sena chief Pawan Kalyan is preparing to fight alone in the upcoming elections..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X