అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరు చెప్పారనే, ఆ బాధ్యత మీదే: పవన్‌తో రైతులు, బాబుకు జనసేనాని వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఉండవల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉండవల్లిలో పర్యటించారు. పంటపొలాల్లో రైతులతో సమావేశమయ్యారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం రైతులు వచ్చారు. పలు పొలాలు తిరిగి పంటలు ఎలా పండుతున్నాయో చూశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును చెప్పుకున్నారు. చంద్రబాబుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీఫోన్ చేసి జగన్ ఉచ్చులో పడొద్దని చెప్పా, ఏపీకి ఇదే నా హామీ, యూటర్న్: బాబును దులిపేసిన మోడీ

 మా పొలాల్లోకి వెళ్లేందుకు ఆధార్

మా పొలాల్లోకి వెళ్లేందుకు ఆధార్

మా పొలంలోకి వెళ్లేందుకు కూడా మేం ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు చంద్రబాబు చెప్పులు లేకుండా వచ్చి తమను ఓట్లు అడిగారన్నారు. ఇప్పుడు మమ్మల్నే గెంటి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా మాకు నిద్రలేని పరిస్థితులు అన్నారు. మా భూముల్లో పంటలు పండటం లేదని తప్పుడు లెక్కలు సృష్టిస్తున్నారని వాపోయారు.

 మీరు చెప్పారని టీడీపీకి ఓటేశాం

మీరు చెప్పారని టీడీపీకి ఓటేశాం

పవన్ కళ్యాణ్‌తో రైతులు మాట్లాడుతూ.. మీరు చెప్పారని ఆనాడు (2014)లో టీడీపీకి ఓటేశామని వాపోయారు. మా భూములు అప్పగించాల్సిన బాధ్యత మీదేనని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ నుంచి ఉండవల్లికి మినహాయింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణం పేరుతో ఉండవల్లి భూములు కాజేయాలని ప్రభుత్వం చూస్తోందని వాపోయారు.

అడ్డుకునే శక్తి పవన్ కళ్యాణ్‌కే ఉంది

అడ్డుకునే శక్తి పవన్ కళ్యాణ్‌కే ఉంది

రైతులు ఇంకా మాట్లాడుతూ.. ప్రభుత్వం దుర్మార్గాన్ని అడ్డుకునే శక్తి పవన్ కళ్యాణ్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 1200 అడుగుల రోడ్డు ఉండవల్లి మీదుగా వేస్తామని తమను వేధించడమే అన్నారు. టీడీపీకి ఓటు వేసినందుకు మాకు ఇది ఫలితం అని వారు వాపోయారు.

 మరో బషీర్‌బాఘ్ కావాలనుకుంటే.. బాబుకు హెచ్చరిక

మరో బషీర్‌బాఘ్ కావాలనుకుంటే.. బాబుకు హెచ్చరిక

మరో బషీర్‌బాగ్ సంఘటన కావాలనుకుంటే రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కోవాలని చంద్రబాబును జనసేనాని హెచ్చరించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. మన భూముల్లోనే మనం అడుక్కునే తినే పరిస్థితికి వచ్చిందన్నారు. భూములను లాక్కుంటే ఎదురు తిరిగి కూర్చుందామని, అప్పుడు ఎవరు లాక్కుంటారో చూద్దామని అన్నారు. మీరు భయపడొద్దన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan has met farmers in Undavalli on Sunday morning. Many Farmers lashed out at CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X