• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీపై పవన్ కల్యాణ్ అసంతృప్తి: ముప్పావల కోడి: అక్కడ ఒంటరిపోరు: బ్రేకప్ చెప్పినట్టేనా?

|

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన జనసేన పార్టీ.. ఆదివారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. జనసేన ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్.. పార్టీ నేతలు, అభిమానులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- తెలంగాణ బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు.

అమిత్ షా గుర్తించినా..

అమిత్ షా గుర్తించినా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ చేస్తోన్న పోరాటాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు గుర్తించారు గానీ.. రాష్ట్రస్థాయిలో ఆ గుర్తింపు, సహకారం లభించట్లేదని పవన్ కల్యాణ్ అన్నారు. తమ పనితీరును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ప్రశంసించారని, తెలంగాణ బీజేపీ నేతల్లో అది కరువైందని చెప్పారు. చివరికి- తమను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సైతం మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ.. కీలకంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వాలు తమను అర్థించే స్థాయికి చేరుకున్నామని చెప్పారు.

ఖమ్మం మున్సిపాలిటీలో ఒంటరిపోరు..

ఖమ్మం మున్సిపాలిటీలో ఒంటరిపోరు..

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలతో ఎలాంటి పొత్తు ఉండబోదని తేల్చేశారు. తమను గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ జనసేన శ్రేణుల గౌరవం తనకు ముఖ్యమని, అది దక్కనప్పుడు వారితో కలవాల్సిన పని లేదని అన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవి గారికి మద్దతు ఇచ్చామని, ఆమె గెలవాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.

రెండు కులాల మధ్య నలిగిపోతోన్న అధికారం..

రెండు కులాల మధ్య నలిగిపోతోన్న అధికారం..

బడుగు, బలహీన వర్గాలు, ఇతర కులాల ప్రజలు, రెండు కులాల మధ్య నలిగిపోయిన అధికారాన్ని చేజికించుకునేందుకు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ అన్నారు. కులంపై గౌరవం ఉండాలి కానీ, తప్పుడు వ్యక్తులు మన కులం వారు అయినా సరే తప్పును తప్పుగా చూపించాలి అప్పుడే వ్యవస్థ మారుతుందని చెప్పారు. వ్యక్తుల కష్టాన్ని దోచుకునే వారు వచ్చి రాజకీయాలు ఏలుతున్నారని ఎద్దేవా చేశారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అభ్యర్థించడం తమ బలానికి నిదర్శనమని అన్నారు.

ముప్పావలా కోడికి..

ముప్పావలా కోడికి..

ఏపీలో జగన్ సర్కార్ పరిపాలన ముప్పావలా కోడికి మూడు రూపాయల దిష్టి తీసినట్లుగా ఉందని పవన్ కల్యాణ్ చురకలు అంటించారు. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కుంటోందని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చడానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో.. వెనుకబడిన కులాలు, దళిత వర్గాలు, సంచార జాతుల అభివృద్ధి కోరుకుంటున్నామని, అన్ని వర్గాల ప్రజల అండదండతో ముందుకు సాగుతామని అన్నారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పారు.

English summary
Jana Sena Party Chief Pawan Kalyan unhappy with BJP Telangana unit. He said in the meeting during the Party formation day.. Amit Shah recognesed our Party but not Telangana BJP unit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X