కృష్ణా జిల్లా నుంచి దరఖాస్తులు, పవన్ కళ్యాణ్ సంతోషం, ఎల్లుండి నుంచి ఎంపిక
జనసేన పార్టీ తరఫున వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రచయితలుగా పని చేసేందుకు కృష్ణా జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో ఎనిమిది వేల దరఖాస్తులు అందినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.
హైదరాబాద్: జనసేన పార్టీ తరఫున వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రచయితలుగా పని చేసేందుకు కృష్ణా జిల్లా నుంచి ఆన్‌లైన్‌లో ఎనిమిది వేల దరఖాస్తులు అందినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శమని చెప్పారు. వీరి నుంచి ఎంపిక చేసేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో శిబిరం నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు.

బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేక పోయినవారు శిబిరంలోనూ పేరు నమోదు చేసుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications