ఎన్డీఏ వైపు శరద్ పవార్..? కీలక మంత్రాంగం..!!

జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చరి త్రాత్మక బిల్లులను ప్రవేశ పెట్టి.. ఆమోదించేలా బీజేపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. పూర్తి స్థాయి మద్దతు కూడగట్టే ప్రణాళికలను అమలు చేస్తోంది. ఉద్ధవ్ శివసేన ఎంపీలు.. టీఎంసీ.. ఆప్ నుంచి ఎంపీలతో ఎన్డీఏ బలం పెరిగింది. ఇక, ఇప్పుడు ఇండియా కూటమిలో కీలకనేతగా ఉన్న శరద్ పవార్ తాజా మంత్రాంగం.. అడుగులు కాంగ్రెస్ కూటమిలో కలవరానికి కారణమవుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ కూటమి లో ఊహించని పరిణామాలు షాక్ గా మారుతున్నాయి. సీనియర్ నేత.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు. ఆ తరువాత ఏక్‌నాథ్‌ షిండే కార్యాలయానికి శరద్‌ పవార్‌ వెళ్లటం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా ఒన్ టు ఒన్ సమావేశం జరిగింది. శరద్ పవార్ పార్టీలోని ఒక వర్గం ఎన్డీయే కూటమిలో చేరడానికి ఆసక్తి ఉందని కొంత కాలంగా సాగుతున్న ప్రచారం వేళ.. ఈ భేటీ రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.

కేబినెట్ భేటీ: తల్లికి వందనం నిధుల జమ, రుణమాఫీ పై కీలక నిర్ణయాలు..!!
కేబినెట్ భేటీ: తల్లికి వందనం నిధుల జమ, రుణమాఫీ పై కీలక నిర్ణయాలు..!!
sharad-pawar-met-maharashtra-deputy-cm-eknath-shinde-in-assembly-amid-political-speculation

పార్లమెంట్ సమావేశాల వేళ కొత్త సమీకరణాలు

షిండే కార్యాలయం మాత్రం ఇది మర్యాద పూర్వక భేటీగా పేర్కొంది. మరో వైపు శివసేన (థాకరే) వర్గం ఈ పరిణామం తో అలర్ట్ అయింది. కాంగ్రెస్ నేతలతో ఈ అంశం పైన చర్చించినట్లుగా పార్టీ నేతల సమాచారం. షిండే కార్యాలయానికి శరద్‌ పవార్ స్వయంగా వెళ్లడంపై ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సందేహం వ్యక్తం చేసారు. ఆయనతో పవార్ జరిపిన భేటీ మిత్రపక్షాలన్నింటి నచ్చలేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ సమావేశంలో ఏం చర్చించారనే విషయం బయటకు రాలేదు. ఇప్పటికే పవర్ త్వరలో ఎన్డీఏ లో చేరుతారని.. ఆయన కుమార్తెకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో.. పార్లమెంట్ సమావేశాలకు ముందు చోటు చేసుకునే రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+