కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92 శాతం అధికంగా ఉందని తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అర్హులకు పథకాలు అందిస్తామని... ప్రతీ హామీ నిలబెట్టుకుంటామని రేవంత్ స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రభుత్వంలో చేపట్టనున్న కీలక లక్ష్యాలను వివరించారు. గోల్కొండ కోటలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రేవంత్‌ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు రైతులకు అందించామని, మొత్తంగా రైతు సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని.. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం సరికొత్త రికార్డులు అధిగమించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని తేల్చి చెప్పారు.

రైతు భీమా బంద్ - మారిన ప్రభుత్వ నిర్ణయం...!!
రైతు భీమా బంద్ - మారిన ప్రభుత్వ నిర్ణయం...!!
cm-revanth-reddy-reaffirms-telangana-government-s-commitment-to-welfare-of-the-poor

రేవంత్ కీలక వ్యాఖ్యలు

అదే విధంగా త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని రేవంత్ వెల్లడించారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సూచీలో 21 నుంచి 14వ స్థానానికి తెలంగాణ చేరిందని రేవంత్ తెలిపారు. నియోజకర్గానికొక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+