జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ: 2024 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్; పవన్ ప్రసంగంపై ఉత్కంఠ!!
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తారని, సభా వేదికగా ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తారు అన్న భావన వ్యక్తమవుతోంది.

2024 ఎన్నికలు టార్గెట్ గా పవన్ దిశా నిర్దేశం చేసే ఛాన్స్
2024 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది. ఈ క్రమంలోనే జనసేన నాయకులు ఆవిర్భావ దినోత్సవ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో ఓడినా ప్రజా క్షేత్రంలో ప్రజల కోసమే పోరాటం
గత ఎన్నికల్లో పోటీ చేసి దారుణ ఓటమికి గురైన జనసేన పార్టీ అయినా వెనుకడుగు వేయకుండా మళ్లీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల దెబ్బకు పవన్ కళ్యాణ్ రాజకీయాలను వదిలేసి మళ్లీ సినిమాలకు పరిమితమవుతారు అని అంతా భావించిన వేళ గెలిచినా ఓడినా ప్రజా క్షేత్రంలోనే ఉంటామని, ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అని తేల్చి చెబుతూ పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు నడుపుతున్నారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభపై పవన్ ప్రకటనతో అందరిలో ఆసక్తి
రాష్ట్రంలోనూ అనేక సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం నిరసన గళం వినిపిస్తూ ప్రజల మద్దతును కూడగట్టడానికి జనసేన పార్టీ ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పై పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉత్కంఠకు కారణంగా మారింది. ఈ సభ రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చే సభ అని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారు అన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసే ఛాన్స్
ఈ సభ వేదికగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు చేయనున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం కోసం అనుసరించవలసిన వ్యూహాలు ఏమిటి అన్న దానిపై ఈరోజు సభలో క్లారిటీ వస్తుందని అటు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, వైసీపీ ప్రభుత్వ పాలన పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్, ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సభలో ఎటువంటి సంచలన ఆరోపణలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
-
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications