టీడీపీ, జనసేన పొత్తులో కొత్త ట్విస్ట్ - చంద్రబాబు ప్రతిపాదనపై ఆగ్రహం..!!

టీడీపీ, జనసేన సీట్ల పంపకాల పై రగడ మొదలైంది. టీడీపీతో పొత్తు ఉన్నా ఎక్కడా రాజీ పడకుడా అన్నింటా గౌరవం దక్కేలా చూస్తానని పార్టీ కేడర్ కు పవన్ హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబుతో తాజాగా జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మాత్రం పార్టీ మద్దతు దారుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇష్టం లేకపోయినా పవన్ కోసం టీడీపీతో కలిసి పని చేస్తున్నా..సీట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల పై వారంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

నచ్చని ప్రతిపాదన
జనసేనకు మద్దతుగా నిలుస్తున్న కాపు వర్గంలోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాల పైన ఆగ్రహంతో ఉన్నారు. తొలి నుంచి పవన్ సీఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేద్దామని పలు సందర్భాల్లో ప్రతిపాదించారు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు టీడీపీతో కలుస్తున్నట్లు వారిని సుముదాయించారు. సీట్లు..అధికారంలో ఎక్కడా తగ్గకుండా తమ వంతు రావాల్సినవి దక్కించుంటామని హామీ ఇచ్చారు. కానీ, ఆ నేతలు మాత్రం 2014 ఎన్నికల్లో పవన్ మద్దతుతో గెలిచిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు. తిరిగి ఇప్పుడు అదే పార్టీతో కలిసి వారికి అధికారం దక్కేలా చేయటం ఏంటని మధన పడుతున్నారు. ఇదే సమయంలో తాజా నిర్ణయాలు వారికి రుచించటం లేదు.

Janasena cadre not willing to continue with TDP for next Elections, Demands 50 seats as party share

ఈ మాత్రానికి పొత్తు అవసరమా
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పవన్ నివాసానికి వెళ్లారు. లోకేష్ యువగళం యాత్ర ముగింపు సభకు పవన్ హాజరు కానని చెప్పటంతో ఇంటికి వెళ్లి ఆయన హాజరయ్యేలా ఒప్పించారు. అదే సమయంలో పవన్ తమ సీట్ల సంగతి తేల్చిమని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే, చంద్రబాబు తాజాగా 25-30 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు మాత్రం తొలి నుంచి 50 అసెంబ్లీ, 5 లోక్ సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారాహి యాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ పెరిగిపోయిందని 25-30 శాతానికపెరిగిందని చెప్పుకొచ్చిన పవన్ 25 స్థానాలు తీసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత టీడీపీలో వచ్చిన మార్పును గుర్తించాలని పవన్ మద్దతు దారులు తమ నేతకు సూచిస్తున్నారు.

కీలక పరిణామాలు
దీంతో కాపు వర్గంలోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాల పట్ల కినుక వహించినట్లు తెలుస్తోంది. పవన్ పై అభిమానంతో సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని ఎన్ని అవమానాలు, అసమానతలు ఉన్నా భరించామని గుర్తు చేస్తున్నారు. ఇపుడు పార్టీలోనే సైలెంట్ గా ఉండిపోదామని ఒక వర్గం డిసైడ్ అయినట్లు సమాచారం. ఎన్నికల్లో వారు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపించటం లేదు. పవన్ పొత్తుప్రకటన తర్వాత జనసేన నాయకులు కొంతమంది యాక్టివ్ గా లేరు. పవన్ కామెంట్ తర్వాత వైజాగ్ లో జరిగిన సభకు జనం పల్చపడిపోవడానికి ఇదే కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు జరిగే సభలకు కూడా ఈ వర్గం దూరంగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం. దీంతో..రానున్న రోజుల్లో పొత్తులో భాగంగా జరిగే ఒప్పందాల పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+