Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి నియామకంపై పవన్ కల్యాణ్ రియాక్షన్...

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్,పద్మశ్రీ కరణం మల్లీశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. కరణం మల్లీశ్వరి స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వీసీగా నియమతులవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కరణం మల్లీశ్వరి నియామకం దేశంలో క్రీడా అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. శ్రీకాకుళం నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పథకం దాకా సాగిన ఆమె ప్రయాణం ఎంతో విలువైనదని అన్నారు.

సిడ్నీ ఒలింపిక్స్‌లో పథకం సాధించడం ద్వారా ఎంతోమంది మహిళలకు మల్లీశ్వరి స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం ఆమె చేపట్టనున్న బాధ్యతల ద్వారా అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారని... దేశం గర్వించదగ్గ ఛాంపియన్లను తీర్చిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.ముఖ్యంగా వెనుకబడిన,గ్రామీణ ప్రాంతాల్లోని ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను సానపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

janasena chief pawan kalyan congratulates karnam malleswari for appointing as delhi sports university vc

అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ(జూన్ 23) కరణం మల్లీశ్వరిని కలిశారు. ఈ సందర్భంగా క్రీడలకు సంబంధించి పలు అంశాలపై ఆమెతో చర్చించారు. ఈ భేటీలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాల్గొన్నారు.

మరోవైపు,ఇవాళ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే సందర్భంగా కరణం మల్లీశ్వరి ట్విట్టర్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, విద్య, అంతర్జాతీయ సహకారం,వివక్షకు తావు లేని సమానత్వంతో కూడిన క్రీడా ప్రపంచాన్ని ఒక జీవన విధానంలా మారుద్దామని పేర్కొన్నారు.

కాగా,ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌(వీసీ)గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ మంగళవారం(జూన్ 22) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ కరణం మల్లీశ్వరే కావడం విశేషం. కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించారు. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లీశ్వరే. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆమెను వీసీగా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+