చంద్రుడి వద్దకు షార్ట్ కట్ రూట్- ఆపోజిట్ డైరెక్షన్.. !!
అంతరిక్ష ప్రయాణాలకు కోట్లాది డాలర్లు వ్యయం అవుతుంటాయి. వీటిలో ఇంధన వినియోగ ఖర్చు అధికం. మొత్తం మూన్ మిషన్ లో ఇంధన వాటా ఖర్చే అధికం. అదనపు ఇంధనం కూడా అంతరిక్ష నౌక బరువును గణనీయంగా పెంచుతుంది. దాని ప్రయాణాన్ని మరింత కఠినంగా, వ్యయప్రయాసలతో కూడినదిగా మారుస్తుంది. గ్రావిటీకి పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి ఉన్నందున ఒక గ్రాము అదనపు ఇంధనం కూడా ఎక్కువే.
ఈ నేపథ్యంలో.. అంతరిక్ష పరిశోధకుల బృందం ఓ నూతన మార్గాన్ని గుర్తించింది. ఈ రూట్ లో చంద్రుడి వద్దకు ప్రయాణిస్తే ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని వెల్లడించింది. తక్కువ ఖర్చుతో కూడిన మార్గాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ రూట్ వల్ల భూమితో మెరుగైన కమ్యూనికేషన్‌ను కూడా ఏర్పడుతుందని పేర్కొంది. దీనిపై ఆస్ట్రోడైనమిక్స్ జర్నల్ లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. బ్రెజిల్, ఫ్రాన్స్ కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.

ఇంటర్‌ప్లానెటరీ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ ను ఉపయోగించి ఈ మార్గాన్ని కనుగొన్నారు. అంతరిక్ష నౌకలు తక్కువ ఇంధనంతో ప్రయాణించడంతో పాటు, భూమిపై ఉన్న గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ తో నిరంతరం కమ్యూనికేషన్ లో ఉండగలవు. భూమి, చంద్రుడి మధ్య ప్రయాణించడానికి వీలైన 30 మిలియన్లకు పైగా మార్గాలను సిమ్యులేషన్ల ద్వారా విశ్లేషించారు. ఈ అధ్యయనం ద్వారా.. అంతరిక్ష నౌకలు తమ ప్రయాణం అంతటా భూమితో నిరంతరం సంబంధాలు కొనసాగించేలా అత్యంత సమర్థవంతమైన మార్గాన్ని గుర్తించారు.
అంతరిక్ష మిషన్లలో రాకెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. సాధారణంగా చంద్రుడి వద్దకు వెళ్లే స్పేస్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా భూమికి దగ్గరగా ఉండే లూనార్ ఆర్బిట్ మార్గాన్ని ఎంచుకుంటాయి. దీనికి భిన్నంగా చంద్రుడికి వ్యతిరేక దిశ నుండి చేరుకోవడం సమయం, ఇంధనం ఆదా అవుతుందని ఆస్ట్రో డైనమిక్స్ జర్నల్ వివరించింది. గురుత్వాకర్షణ క్షేత్రాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని పేర్కొంది.
దీనివల్ల సుమారు సెకెనుకు 58.8 మీటర్ల దూరం మేర ఇంధనాన్ని తగ్గిస్తుంది. ఇది చిన్న పొదుపే అయినా అంతరిక్ష ప్రయాణ విషయంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది. మూన్ మిషన్ ఖర్చులు తగ్గించడం, అదనపు పేలోడ్ కు అవసరమైనంత స్థలం లభించడం, అంతరిక్ష నౌక జీవితకాలం పెంచడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్ సమస్యకు కూడా సమర్థవంతంగా పరిష్కారం లభిస్తుంది.
స్పేస్ క్రాఫ్ట్స్ చంద్రుడి వెనుకభాగంలో ప్రయాణించేటప్పుడు భూమితో తాత్కాలికంగా సంబంధాలను కోల్పోతుంటాయి. ఆర్టెమిస్ 2 మిషన్‌లో కూడా ఇలాంటి అంతరాయం ఎదురైంది. ఈ షార్ట్ కట్ రూట్ గుండా వెళ్తే ఆ సమస్య ఉండదని ఈ జర్నల్ తెలిపింది. తమ మొత్తం ప్రయాణంలో నిరంతరం భూమితో కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి స్పేస్ క్రాఫ్ట్స్ కు వీలు కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications