దటీజ్ విజయ్..మాటిచ్చారంటే..! టీవీకే సంచలన ట్వీట్..!

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ (Vijay) ప్రస్తుతం ఓవైపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ, మరోవైపు పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన చేసిన కేబినెట్ విస్తరణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చింది. దీనికి కారణం విజయ్ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు సైతం మంత్రులుగా అవకాశం కల్పించడమే. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే చేయని పని చేయడం ద్వారా విజయ్ ఇప్పుడు సరికొత్త రాజకీయానికి తెరదీశారు.

విజయ్ కేబినెట్ విస్తరణ-కొత్తగా 23 మంత్రులు..! మిత్రపక్షాల ట్విస్టులు..!
విజయ్ కేబినెట్ విస్తరణ-కొత్తగా 23 మంత్రులు..! మిత్రపక్షాల ట్విస్టులు..!

ఈ నేపథ్యంలో తమిళనాడు కేబినెట్ లో తమ కూటమిలో మిత్రులకు సీఎం విజయ్ భాగస్వామ్యం కల్పించడంపై టీవీకే ట్వీట్ చేసింది. ఆయన తన మాట నిలబెట్టుకున్నారు! అంటూ ప్రశంసలు కురిపించింది. సీఎం విజయ్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడని నిరూపించుకున్నారని తెలిపింది. అధికార పగ్గాలన్నీ ఒకే పార్టీ చేతిలో ఉన్న ఈ పరిస్థితుల్లో, ప్రజల కోసం ఏర్పడే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండాలనే సూత్రానికి ఆయన గట్టిగా కట్టుబడి, దానిని అమలు చేయడం ప్రారంభించారని వెల్లడించింది.

Tamil Nadu CM Vijay Delivers on Power-Sharing Pledge TVK Hails a New Era of Democratic Governance
స్టాలిన్ ఆగ్రహం.. గంటల్లోనే విజయ్ యూటర్న్..!
స్టాలిన్ ఆగ్రహం.. గంటల్లోనే విజయ్ యూటర్న్..!

ఎన్నికలకు ముందే, తనను సంప్రదించి, తనతో చేతులు కలపాలనుకునే కూటమి పార్టీలకు తగిన గౌరవం, అధికారంలో సమాన వాటా ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారని,అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా, క్షేత్రస్థాయి కార్యకర్తల నుండి కూటమి పార్టీల వరకు విస్తృతంగా పంపిణీ చేయాలని తెలిపింది. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ఒక నాయకుడి శైలికి ఉత్తమ ఉదాహరణ అని పేర్కొంది. లక్షలాది మంది ప్రజల సమక్షంలో సదస్సు వేదికపై ఆయన చేసిన వాగ్దానం, ఇప్పుడు ఆయన తదుపరి రాజకీయ ఎత్తుగడలలో ప్రతిఫలిస్తోందని తెలిపింది. 'పరిపాలనలో వాటా' అనేది 'చెప్పినట్లే చేస్తాడు, చేసినట్లే చెబుతాడు' అనే నినాదానికి కొనసాగింపుగా కేవలం మాటల గారడీ అని భావించిన వారి కోసం, నాయకుడు విజయ్ ఇప్పుడు విక్రవాండిలో తాను నాటిన విధాన బీజాన్ని ఆచరణలోకి తీసుకువస్తున్నారని వివరించింది. ఇది తమిళనాడు భవిష్యత్ రాజకీయ గమనాన్ని పునర్నిర్మించే ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+