Pawan Kalyan at Vizag Beach : వైజాగ్ బీచ్ లో పవన్ కళ్యాణ్ ఈవెనింగ్ వాక్-మత్సకారులతో కాసేపు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం వైజాగ్ తీరంలో దర్శనమిచ్చారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ సడన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం వైజాగ్ వచ్చారు. అనంతరం ప్రధాని మోడీతో ఐఎన్ఎస్ చోళ అతిధి గృహంలో భేటీ అయ్యారు. రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నోవోటెల్ హోటల్ కు వెళ్లిపోయారు.రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోతారని భావించినా ఇవాళ కూడా విశాఖలోనే ఉన్నారు. ఉదయం నుంచి హోటల్లో ఉంటూ మధ్యలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. సాయంత్రానికి బీచ్ లో దర్శనమిచ్చారు. సాయంత్రం బీచ్ లో పవన్ వాకింగ్ చూపరుల్ని ఆకర్షించింది. దీంతో భారీగా జనం తరలివచ్చారు.

పవన్ కళ్యాణ్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. తొలుత బీచ్ నీళ్లలో నడుస్తూ ఎంజాయ్ చేసిన పవన్... అనంతరం జనం తాకిడి పెరుగుతుంటంతో అక్కడి నుంచి బయలుదేరారు.అయినా దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. మధ్యలో బౌన్సర్లు ఉండటంతో జనం తాకిడిని ఎలాగోలా తట్టుకున్నారు. చివరికి అతి కష్టం మీద అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.













Click it and Unblock the Notifications