పవన్ కొత్త వ్యూహం, టీటీపీలో కొత్త టెన్షన్ - ముందుకెళ్లేది ఎలా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని నేతలు భావిస్తున్నారు. బీజేపీ నిర్ణయం కోసం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తన పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వ్యూహాలే ఇప్పుడు టీడీపీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. సీట్లు మొదలు అధికార ఒప్పందాల వరకు చివరి నిమిషం వరకు ఒత్తిడి కొనసాగటం ఖాయమనే చర్చ వినిపిస్తోంది.

పొత్తులతో కొత్త సమస్యలు : ఏపీలో సీఎం జగన్ తాను సింగిల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తు ఇక లాంఛనమే. బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ నమ్మకంతో ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలని చంద్రబాబు వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జగన్ పూర్తి సంక్షేమ ఓట్ బ్యాంక్ నే నమ్ముకున్నారు.

Janasena Chief Pawan Kalyan new strategies leads new Tension in TDP Amid Alliance politics

పాజిటివ్ ఓట్ బ్యాంక్ తో అధికారం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నిర్ణయం వచ్చే వరకు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటనకు దూరమనేది స్పష్టం అవుతోంది.2018 లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ తో కలవటం.. మోదీ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల పైనా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.

బీజేపీ తీరుపై సందేహాలు : ఎన్నికల నాటికి బీజేపీ తమతో కలిసి వస్తుంనే ధీమా టీడీపీ, జనసేనలో కనిపిస్తోంది. బీజేపీ కలిసి రాకపోతే పవన్ ఏం చేస్తారనేది మరో కీలక అంశం. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతోనే ఉంటారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దీంతో, బీజేపీ నిర్ణయం అనుకూలంగా ఉంటే ఒక రకంగా.. వ్యతిరేకంగా వస్తే మరో రకమైన సమస్య తప్పదని టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు.

బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోతే పవన్ కీలకంగా మారుతారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో మరింత పట్టు బిగించే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ కలిసినా.. ఆ రెండు పార్టీలకు సీట్లు దాదాపు 40 వరకు ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలు చెబుతున్నారు.

Janasena Chief Pawan Kalyan new strategies leads new Tension in TDP Amid Alliance politics

స్పష్టత కోసం ఎదురు చూపులు : ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాల్లో తమ బలం భారీగా పెరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. బీజేపీ, జనసేనతో పొత్తు ఖాయమైతే కేటాయించే సీట్లతో ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాల్లో పార్టీ సీటు పైన ఆశలు పెట్టుకొని పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన నేతల నుంచి వ్యతిరేకత తప్పదనే భయం వెంటాడుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే జనసేన నేతలు అభ్యర్దులుగా బరిలోకి దిగటానికి సిద్దం అవుతున్నారు.

అదే సమయంలో సీట్లతో పాటుగా సీట్లు దక్కని నేతల మద్దతు దారులు..పార్టీల నుంచి ఓట్ల బదలాయింపు సమస్యగా మారుతోంది. ఎన్నికల వరకు సీట్ల సంగతి తేల్చకపోతే, చివరి నిమిషంలో పొత్తులు..సీట్ల కేటాయింపు..ఓట్ల బదిలీ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందనేది టీడీపీ నేతల టెన్షన్ గా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం పైన దసరా వరకు స్పష్టత వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+