టీడీపీకి బీ టీం, సొంత పార్టీ నేతలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. వారాహి యాత్రలో సీఎం జగన్ లక్ష్యంగా పవన్ ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్ల పైన పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలోనూ వాలంటీర్ల వ్యవస్థ పైన మండిపడ్డారు. ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తారు. ఇప్పుడు పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. వైసీపీ వాళ్లు తన గురించి అనటం వేరని...మన వాళ్లే నమ్మటం వేరంటూ వ్యాఖ్యానించారు.
Recommended Video

పార్టీ నేతల సమావేశంలో వైసీపీ తన పైన చేస్తున్న విమర్శలను పవన్ ప్రస్తావించారు. తనను బీ టీం అంటున్న వైసీపీ మర్దర్ టీం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జనసేన టీడీపీకి బీం అని వైసీపీ అనటం వేరని..ముందు లోపల వాళ్లే సందేహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు పడతాయని పవన్ చెప్పుకొచ్చారు.

తమను ఇంతలా టార్గెట్ చేస్తున్నారంటే మన బలం ఏంటో వాళ్లే గుర్తించారని వివరించారు. మనవాళ్లే మొదట సందేహిస్తారని పేర్కొన్నారు. తనకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదని..తన పోరాటంలో నిజాయితీ ఉందని పవన్ వివరించారు. బయట వాళ్లు మనల్ని కొట్టాలంటే మన వాళ్లు తలుపు తీస్తేనే సాధ్యం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేసారు.
గతంలోనూ పవన్ పార్టీ నేతలకు ఒకింత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బయట కనిపించే శత్రువులతో పోరాటం చేయవచ్చని...కనిపించని శత్రువు ప్రమాదమని చెప్పుకొచ్చారు. పార్టీలో ఉండి విమర్శలు చేయటం కంటే బయట ఉండి మాట్లాడాలని స్పష్టం చేసారు. తాజాగా పవన్ కల్యాణ్ వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది.
దీని పైన వాలంటీర్లు ఆందోళనకు దిగారు, ప్రతిగా జనసైనికులు రోడ్ల మీదకు వచ్చారు. జనసైనికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలో పవన్ పైన కేసు నమోదు అయింది. దీనికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు విజయవాడలో అందోళన చేసారు. పవన్ తన వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్ పైన తన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications