స్టాలిన్ రమ్మన్నారు కానీ.. డీలిమిటేషన్ భేటీపై జనసేన క్లారిటీ..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు ముందే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీలో జనసేన పార్టీకి కూడా ఆహ్వానం అందింది. దీంతో జనసేన ఇవాళ చెన్నై భేటీకి హాజరైనట్లు వార్తలొచ్చాయి.
దీనిపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై తమకు ఆహ్వానం అందిందని, అయితే హాజరు కాలేమని సమాచారమిచ్చినట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చిందని , అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించినట్లు జనసేన తెలిపింది.

ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరఫున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారని, వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. ఆ మేరకు సమాచారం ఇచ్చామన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే, ఈ అంశంపై తమ విధానం తమకు ఉందని జనసేన పార్టీ తెలిపింది. ఈ విషయమై తమ విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తామని వెల్లడించింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications