జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన నేత - ఆ ఖర్చు నా సేన..కోసం..!!
ముఖ్యమంత్రి జగన్ పై నిత్యం విమర్శలు చేసే జనసేన నేతల్లో సడన్ ఛేంజ్. ముఖ్యమంత్రి ఈ మూడేళ్ల కాలంగా తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని టీడీపీ..జనసేన విమర్శిస్తూ వచ్చాయి. కానీ, తొలి సారిగా జనసేన ముఖ్య నేత..ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. స్వాగతించారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు వైసీపీలోనే కాదు..ఇటు జనసేనలోనూ చర్చకు కారణమవుతోంది. తాజాగా.. ముఖ్యమంత్రి జగన్ విశాఖలో పర్యటించారు. అక్కడ సభలో మాట్లాడుతూ కీలక నిర్ణయం వెల్లడించారు.
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. తిరుమల స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణక్ష్ం అమలు చేయాటానికి డిసైడ్ అయ్యారు. అదే సమయంలో ప్లాస్టిక్ స్థానంలో క్లాత్ బ్యానర్లు కట్టాలంటూ సూచన చేసారు. కొంత డబ్బులు ఖర్చు అయినా..క్లాత్ బ్యానర్లే వినియోగించాలని స్పష్టం చేసారు. దీని పైన జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రా సీఎం ప్లాస్టిక్ ఫ్లెక్సీ నిషేధాన్ని స్వాగతిద్దాం అంటూ ట్వీట్ చేసారు. సెప్టెంబర్ 2న జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం.

పవన్ జన్మదినం సందర్భంగా
ఆ రోజున అభిమానులు..పార్టీ శ్రేణులు ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు చేసే ఖర్చును తాజాగా.. జనసేన ప్రారంభించిన నా సేన కోసం..నా వంతుకు డొనేట్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతిపక్షాల నుంచి లభించిన తొలి మద్దతు ఇదే. బొలిశెట్టి సత్యానారాయణ నిత్యం టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొని పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తూ ఉంటారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా.. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా పని చేస్తామని కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ ప్రకటించారు.

జనసేనాని అంగీకరిస్తారా
పొత్తుల విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేనని అంటూనే..జనసేన వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ మరోసారి స్పష్టం చేసారు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీ - జనసేన కలిసి పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు జనసేన నేత చేసిన ట్వీట్ పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. బొలిశెట్టి సత్యానారాయణ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించటాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా.. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications