విశాఖ స్టీల్ పై దొంగ ఉద్యమాలు-జనసేన నేత ఫైర్-చంద్రబాబును నిలదీయాలని సూచన...!

ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా ముడిసరుకు కొరత ఏర్పడటం, చివరికి అది ప్లాంట్ మూసివేతకు దారి తీస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమపై ఒత్తిడి పెంచుతున్న కార్మిక నేతలపై ఇవాళ జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో కార్మిక నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీల్ ప్లాంట్ ఎలా అమ్మేయాలని కార్మిక సంఘం నేతలు చూస్తున్నారని బొలిశెట్టి సత్య ఆరోపించారు. ఎవరో ఒకరు తప్ప మిగతా కార్మిక నేతలంతా తప్పు చేస్తున్నారన్నారు. అప్పట్లో ప్రైవేటీకరణ విషయం తెలియగానే పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఇది సెంటిమెంట్ తో ఏర్పాటైందని తెలిపారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ ఉద్యమాలు మొదలుపెట్టలేదని, పవన్ ఢిల్లీ వెళ్లారని తెలియగానే కార్మిక నేతలు దుకాణాలు తెరిశారని గుర్తుచేసారు.

janasena leader bolisetty Satyanarayana blames labour unions for vizag steel plant privatisation

ఉక్కు నిర్వాసితుల్ని పక్కకు తోసేసి వీళ్లే ఉద్యమాలు మొదలుపెట్టారు. తప్పుడు ఉద్యమాలు చేసి అవి నీరుగారిపోతున్న సమయంలో పవన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారని బొలిశెట్టి సత్య ఆరోపించారు. దొంగ ఉద్యమాలు సరిగా జరగడం లేదని మళ్లీ పవన్ ఢిల్లీ వెళ్లేందుకు అఖిలపక్షం వేయాలని కోరారన్నారు. సాయిరెడ్డి విశాఖలో పాదయాత్రలు చేస్తూ కాలం గడిపేశారని, పవన్ నిరాహారదీక్ష చేసినా కార్మిక నేతలు ముందుకు రాలేదని గుర్తుచేశారు. కావాల్సిన నాటకాలు ఆడి, జగన్, విజయసాయిరెడ్డి ప్రైవేటీకరణకు సాయం చేశారని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదన్నారు.

ఢిల్లీకి వెళ్లింది లేదని, కేంద్రంపై ఒత్తిడి పెంచలేదని బొలిశెట్టి సత్య విమర్శించారు. కానీ అప్పట్లో వీరంతా జగన్ ను నిలదీయలేదని కార్మిక సంఘం నేతల తీరును ఆక్షేపించారు. ఇప్పుడు సాయిరెడ్డి మేం ఉన్నంతకాలం ఆపానని చెప్తున్నారని, బొత్స మేం ఆపాం, మీరు ఆపాలని చెప్తున్నారని సత్య విమర్శించారు. అప్పట్లో వీరంతా అఖిలపక్షం వేయాలని అడగలేదని, సాయిరెడ్డి సహా మిగతా రెడ్లు, అంబటి, రోజా వంటి వారందరినీ ఇదే అడుగుతున్నామన్నారు.

కార్మిక నేతలు ఇప్పుడు పవన్ ను కలవాలని భావిస్తున్నారని, గతంలో ఎందుకు రాలేదని ఇప్పుడు వీళ్లని అడగాలన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నేతలు సహా అందరినీ ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఇప్పుడు చంద్రబాబును అఖిలపక్షం కోసం కార్మిక నేతలు నిలదీయాలని బొలిశెట్టి సత్య సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+