రాజదాని అక్కడ వద్దు ! చంద్రబాబుకు జనసేన నేత బొలిశెట్టి సత్య ట్విస్ట్..!

ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది. అయితే వాటిని అమల్లోకి తీసుకురాకముందే అధికారం కోల్పోయింది. అనంతరం అమరావతి రాజధాని అజెండాతో ముందుకెళ్లిన విపక్ష ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతికి మహర్దశ రానుందన్న అంచనాల నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విస్ట్ ఇచ్చారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణం విషయంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎన్డీయే ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. "మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకు పోతున్న వాహనాలను చూశాం.. నిన్న ఉత్తరాఖండ్ లో గంగానది వరదల్లో వాహనాలు కొట్టుకు పోయాయి.. రేపు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే.. " ఏం చేయాలో సత్య వెల్లడించారు.

janasena leader bolisetty Satyanarayana key suggestion to Chandrababu on on Amaravati capital

"మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు.. గుంటూరులోనే ఎగువ ప్రాంతాలలో రాజధాని నిర్మాణం జరగాలి.. జరీబు భూములు కేవలం 3పంటలు పాండే ప్రాంతమే కాదు అవి ఇసుక తిన్నెల (floodplains) పై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం దానిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలి. అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి.. అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయాలకి తట్టుకొని నిలబడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి" అంటూ బొలిశెట్టి సత్య ముగించారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+