పవన్ పార్టీలో ఆ కీలకనేతను టార్గెట్ చేసిన జనసేన నేతలు: ఎందుకంటే

జనసేన పార్టీలో ఇటీవల నేతల వలసలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ నుండి బయటకు వెళుతున్న నేతలు పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు తెలియకుండా ఆయన చుట్టూ కోటరీ పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటరీ ఎవరు అన్నదానిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా ఓ నేతను టార్గెట్ చేసి బయటకు పంపించే ఆలోచనలో కొందరు జనసేన నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేసిన జనసేన నేతలు

నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేసిన జనసేన నేతలు

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత కీలకంగా వ్యవహరించే నేతలు ఎవరు అంటే ముఖ్యంగా వినిపిస్తున్న పేరు నాదెండ్ల మనోహర్. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన నాటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్,ఆయనకు పార్టీలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. నాదెండ్ల మనోహర్ పై ఎవరెన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఆయనే కొందరు నేతలకు టార్గెట్ అయ్యారు.

జనసేనాని పవన్ కు సలహాలు ఇచ్చే నాదెండ్ల

జనసేనాని పవన్ కు సలహాలు ఇచ్చే నాదెండ్ల

పరిపాలనాపరమైన అంశాల్లో అవగాహన ఉన్న నేత కావడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో ఆయన సలహా తీసుకుంటున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతూ, పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు నాదెండ్ల మనోహర్. రాజకీయ వ్యవహారాలపై సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు జనసేనలో చేరిఎన్నికల్లో ఓటమి తర్వాత వెళ్లి పోయినప్పటికీ, నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేన ను అంటిపెట్టుకొని పని చేస్తున్నారు.

పవన్ కు తమకు మధ్య అడ్డుగా ఉన్నారని గుర్రుగా ఉన్న నేతలు

పవన్ కు తమకు మధ్య అడ్డుగా ఉన్నారని గుర్రుగా ఉన్న నేతలు

ఇక పార్టీ లో చేరిన నాటి నుండి ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడారు. తనపని తాను చేసుకుపోయే స్వభావం నాదెండ్ల మనోహర్ ది. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలోకి వెళ్లినప్పటికీ నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ ను వీడి బయటకు వెళ్ళలేదు. ఇక పవన్ కళ్యాణ్ సైతం నాదెండ్ల మనోహర్ కు పార్టీకి సంబంధించిన కీలక కమిటీలలో బాధ్యత అప్పగించి పెద్ద పీట వేశారు. ఇక ఈ సమయంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఎంత సన్నిహితంగా ఉండటంతో నచ్చని నాయకులు, ఆయన పవన్ కు దగ్గర కాకుండా కొందరు నాయకులకు అడ్డు తగులుతున్నారని భావిస్తున్న నేపధ్యంలో ఆయనపై గుర్రుగా ఉన్నారని సమాచారం .

నాదెండ్ల ను బయటకు పంపే యత్నాలు

నాదెండ్ల ను బయటకు పంపే యత్నాలు

పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలలో నాదెండ్ల మనోహర్ పాత్ర ఉన్నట్లుగా వారు భావిస్తున్నారు. అందుకే నాదెండ్ల మనోహర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పై పలుమార్లు నిరసన గళం వినిపించినప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ అవేమి పట్టించుకోకుండా మిన్నకున్నారు. అయితే జనసేన పార్టీలో తన ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తున్న కొందరు నేతలు నాదెండ్ల మనోహర్ ను బయటకు పంపించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+