Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాఫ్టరా ? గుంతల్లో వెళ్లలేకే ! నాదెండ్ల మనోహర్ కామెంట్స్..

ఏపీలో రైతు భరోసా పథకం నిధుల పంపిణీ కోసం ఇవాళ తెనాలికి సీఎం జగన్ చేపట్టిన పర్యటనలో అధికారుల ఓవరాక్షన్ విమర్శలకు కారణమవుతోంది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ ఇవాళ పర్యటిస్తున్నారు. రైతు భరోసా పథకం నిధుల పంపిణీ కోసం జగన్ తెనాలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేస్తున్న హంగామా విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిపివేత, రోడ్లపై ఆంక్షలు, తాడేపల్లి నుంచి తెనాలికి సీఎం జగన్ హెలికాఫ్టర్ ప్రయాణం కోసం చేసిన ఏర్పాట్లు అన్నీ విమర్శలకు కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన సొంత నియోజకవర్గం తెనాలిలో అధికారుల హంగామాపై ఇవాళ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు భయం ఎక్కువవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావమన్నారు.

janasena leader nadendla manohar questions jagans chopper ride from tadepalli to tenani

ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయమని, అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా... వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుంది? అని నాదెండ్ల విమర్శలు చేశారు. సీఎం పర్యటన ముస్తాబుల కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందుల పాలు చేశారని, ఈ రోజు తెనాలి పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని నాదెండ్ల ఆరోపించారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం... చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అనిపిస్తోందన్నారు. తెనాలి ఎంతో ప్రశాంతమైన పట్టణం. కళలు, సంస్కృతికి నెలవైన తెనాలిలో ప్రజలు ప్రశాంతత కోరుకుంటారన్నారు. అలాంటి పట్టణంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలన అని నాదెండ్ల విమర్శించారు.

జగన్ రెడ్డి రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని, తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిమీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా? అని నాదెండ్ల విమర్శలు గుప్పించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటి? జనం నవ్వుకొంటున్నారన్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోందని, హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయన్నారు. రోడ్డు మీద వెళ్తే గుంతలు, పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా? ప్రజలను మాత్రం గతుకుల రోడ్ల పాలుచేసి తను మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+