జగన్ ఆలోచన బాగుందన్న జనసేన ఎమ్మెల్యే..! కండిషన్స్ అప్లై..
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారం కోల్పోవడం ఓ ఎత్తయితే దాని వల్ల తలెత్తుతున్న పరిణామాలు మరో ఎత్తుగా మారిపోయాయి. ఇందులో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ కూడా ఒకటి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన అధికారులు, రాజకీయ నేతల పేర్లు రాసుకుని మరీ వారిని టార్గెట్ చేస్తున్న లోకేష్ పై ఇప్పటికే జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో తాజాగా తమ ఐడియా ఒకటి బయటపెట్టారు.
లోకేష్ రెడ్ బుక్ గొప్పేమీ లేదని తేల్చిచెప్పేసిన వైఎస్ జగన్.. తాము గుడ్ బుక్ తెస్తున్నట్లు వెల్లడించారు. గుడ్ బుక్ అంటే అందులో తమ పార్టీ కోసం పనిచేసిన నేతల పేర్లు రాసుకుంటామని, వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని తెలిపారు. దీనిపై వైసీపీతో పాటు కూటమి పార్టీల్లోనూ సానుకూల స్పందన వస్తోంది. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే ఈ గుడ్ బుక్ ను స్వాగతించగా.. ఇవాళ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా స్పందించారు.

ఆలోచన బావుంది కానీ రాసేవాడు కూడా మంచోడు అయ్యుండాలిగా.. https://t.co/OAMe0gD93a
— Bolisetti Srinivas (@BolisettiSrinu) October 9, 2024
వైఎస్ జగన్ ఆలోచన బావుంది కానీ రాసేవాడు కూడా మంచోడు అయ్యుండాలిగా..అంటూ గుడ్ బుక్ గురించి బొలిశెట్టి శ్రీనివాస్ ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఓ పోస్టును సైతం షేర్ చేశారు. ఇందులో వైసీపీ.. గుడ్ బుక్ ఇందులో మంచి వాళ్ల పేర్లు మాత్రమే ఉంటాయని జగన్ చెబుతూ చూపిస్తున్న ఫొటోను ఉంచారు. తద్వారా జగన్ గుడ్ బుక్ ఆలోచన మంచిదేనని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చెప్పినట్లుంది.












Click it and Unblock the Notifications