Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ తప్పుకొన్న వేళ.. జనసేన ఎమ్మెల్యేకే వరించిన కీలక పదవి

Pulaparthi Ramanjaneyulu: ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారానికి తెరపడింది. ఈ కీలక పదవిని జనసేన దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన భీమవరం శాసన సభ్యుడు పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు.. పీఏసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మరో ఎనిమిది మంది సభ్యులుగా నామినేట్ అయ్యారు.

సాధారణంగా ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌.. పదవిని అధికార పార్టీ- ప్రతిపక్షానికి కేటాయిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. 2019లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ హోదాను తెలుగుదేశానికి అప్పగించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Janasena MLA Pulaparthi Ramanjaneyulu elected as chairman of PAC

ఇప్పడు ఆ సంప్రదాయానికి తెరపడింది. ప్రతిపక్ష హోదా లేకపోవడం, సభ ఆశించిన స్థాయిలో సంఖ్యా బలం లేకపోవడం వంటి పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీకి ఈ పదవి దక్కలేదు. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా, 21 మంది శాసన సభ్యుల బలం ఉన్న జనసేనకే ఇది వరించింది.

పీఏసీ ఛైర్మన్ హోదా దక్కించుకోవాలంటే సభలో కనీసం 18 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. బలం లేనప్పటికీ ఈ హోదా కోసం తొలుత వైఎస్ఆర్సీపీ పోటీ పడింది. సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ సైతం దాఖలు చేశారు. పోటీ తప్పదనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఈ ఎన్నికలను బహిష్కరించింది.

కాగా- ఇప్పుడు తాజాగా పీఏసీలో సభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్‌ (టీడీపీ- జగ్గయ్యపేట), బీవీ జయ నాగేశ్వర్‌రెడ్డి (టీడీపీ- ఎమ్మిగనూరు), అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ- తణుకు), ముత్తుముళ్ల అశోక్‌ రెడ్డి (గిద్దలూరు), బూర్ల ఆంజనేయులు (టీడీపీ- ప్రత్తిపాడు), నక్కా ఆనంద్‌ బాబు (టీడీపీ- వేమూరు), కోళ్ల లలితకుమారి (టీడీపీ- శృంగవరపు కోట), విష్ణుకుమార్‌ రాజు (బీజేపీ- విశాఖపట్నం నార్త్) ఎన్నికయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+