Mini Varahi : పవన్ కు అభిమాని అరుదైన గిఫ్ట్- 10 రోజుల్లో మినీ వారాహి తయారు చేసి..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు రోడ్లపై ప్రచారాలతో బిజీగా తిరుగుతుంటే వారి అభిమానులు ఇప్పుడు నేతల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర జరిపిన పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇచ్చేందుకు ఆయన అభిమాని ఏకంగా మినీ వారాహి వాహనాన్ని తయారు చేశాడు. పార్టీకి చెందిన ఓ మహిళా నేత కుమారుడే ఈ విధంగా పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు.
పవన్ కు అభిమాని అరుదైన గిఫ్ట్- 10 రోజుల్లో మినీ వారాహి తయారు చేసి..!!#PawanKalyan #JANASENA #VarahiVijayYatra #Varahi #Oneindiatelugu pic.twitter.com/AWmNK840qJ
— oneindiatelugu (@oneindiatelugu) June 26, 2023
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అదే సమయంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. దీంతో పవన్ కు వారాహి పోలికలతో ఓ చిన్న వాహనం తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతున్న వారాహిని చూసి మినీ వారహిని తయారు చేశాడు. ఆ బుడతడు ఈ మినీ వారాహిని తయారు చేయడానికి సుమారు 10 రోజులు సమయం పట్టింది. దీనిని పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయనకు బహుమతిగా ఇవ్వటం కోసం తయారు చేశానని బాలుడు తెలిపాడు. ఇప్పటికే కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర ముగించుకుని నరసాపురం చేరుకున్న పవన్ కు త్వరలోనే ఈ వాహనాన్ని అందించే అవకాశముంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా ఆయనకు అభిమానులు వివిధ రూపాల్లో గిఫ్ట్ లు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని పవన్ కూడా ఆప్యాయంగా స్వీకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మినీ వారాహి వాహనం కూడా రూపుదిద్దుకుంది. ఇది ఇప్పుడు పవన్ అభిమానుల్ని కూడా ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications