పాపం...జగన్ కు న్యాయం చెయ్యండి, సీఎం, పవన్ కు జనసేన నాగబాబు మనవి
ప్రముఖ నటుడు, సినీ నిర్మాత, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది.
మాజీ సీఎం జగన్ కు న్యాయం చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి ఉందని నాగబాబు ఎద్దేవ చేశారు. మాజీ సీఎం జనగ్ కు న్యాయం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడిని, డీసీఎం పవన్ కల్యాణ్ ను, హోం మంత్రి అనితను కొరుతున్నానని జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో మనవి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

అమాయకుడైన మాజీ సీఎం జగన్ కు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చెయ్యాలని జనసేన నాయకుడు నాగబాబు వ్యంగ్యాస్రాలు సందించారు. జగన్ కు ఎందుకు న్యాయం చెయ్యాలి, ఏ విషయంలో న్యాయం చెయ్యాలి అని కూడా నాగబాబు వివరించారు. 2019లో శ్రీను అనే వ్యక్తి జగన్ మీద కోడి కత్తితో దాడి చేశారని, ఐదు సంవత్సరాలు అయినా అమాయకుడైన జగన్ కు న్యాయం జరగలేదని జనసేన నాయకుడు నాగబాబు ఎద్దేవ చేశారు.
ఇంతకాలం జగన్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన కేసు విచారణకు హాజరుకాలేకపోయారని, అందుకే కోడికత్తి శ్రీను కేసు కొలిక్కిరాలేదని, అయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్ ఖాళీగానే ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ కు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆదిశగా కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు ఎద్దేవ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
జనసేన నాయకుడు నాగబాబు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని నెటిజన్లు అంటున్నారు. ఒక్కోసారి జనసేన నాయకుడు నాగబాబు చేసే పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేసిన సందర్బాల గురించి కొత్తగా చెప్పనవసం లేదు. నాగబాబు కామెంట్లపై వైసీపీ నాయకుల స్పందన కోసం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications