మారుతున్న పవన్ లెక్కలు - వారి పైనే గురి, కీలక మలుపు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. అటు వైసీపీ సైతం సై అంటోంది. ఇదే సమయంలో పవన్ తాజా వ్యూహాలు ఆసక్తి కరంగా మారాయి. మారుతున్న సమీకరణాల వేళ పవన్ భవిష్యత్ అంచనాలతో కొత్త నిర్ణయాల అమలుకు సిద్దం అయ్యారు. పవన్ గురి కుదిరితే మొత్తం లెక్క మారటం ఖాయం.
డిప్యూటీ సీఎం.. జనసేనాని కీలక అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కొత్త కమిటీల ఏర్పాటు కసరత్తు ప్రక్రియ తుది దశకు చేరింది. ఇక, జాతీయ స్థాయిలో గత నెలలో చోటు చేసుకున్న పరిణామాల తో జెన్ జీ కీలకంగా మారింది. రాజకీయంగా ఎవరైనా నిలబడాలంటే జెన్ జీ అనుకూల నిర్ణయాలతో నే సాధ్యమనే అభిప్రాయం ఏర్పడింది.

దీంతో.. పవన్ ఇప్పుడు వ్యూహం మార్చారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు (బుధవారం) పవన్ జన్మదినం నాడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో కేరళలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమానికి హాజరుకానున్నారు.
విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జనసేన ప్రణాళికలు రచించింది. అలాగే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు.
అయితే, ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ పవన్ యువత పైన ఫోకస్ చేస్తున్నారు. కూటమిలో కొనసాగుతూనే యువతను తన పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయటం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న యువత ఓటింగ్ మద్దతు ఎన్నికల్లో కీలకం కానుంది. దీంతో.. వారి పైనే పవన్ గురి పెట్టారు. పవన్ గురి కుదిరితే రాజకీయం గా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications