వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైల మంత్రి, మీడియా సీఎం, క్రికెట్ బెట్టింగ్ మంత్రి.. మీ చరిత్ర ఎవరికి తెలీదు; మంత్రులకు పవన్ పార్టీ పంచ్ !!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జనసేన పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రముఖ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదంగా మారిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న మంత్రులకు జనసేన పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రులను తిట్టిపోస్తున్నారు.

మైల మంత్రి.. సన్నాసి మంత్రి : పోతిన మహేష్ ధ్వజం

మైల మంత్రి.. సన్నాసి మంత్రి : పోతిన మహేష్ ధ్వజం

వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, హిందూ ధర్మం ప్రకారం మైల ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్లకూడదని ఇంగిత జ్ఞానం లేని మంత్రి అని, అతి తొందరలో మంత్రి వెల్లంపల్లి కి వైసీపీకి బుద్ధి చెబుతామని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో సన్నాసి మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన చరిత్ర విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. మైల మంత్రి, సన్నాసి మంత్రి అంటూ తిట్టిపోశారు.

 మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందని రాజకీయాలా ?

మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందని రాజకీయాలా ?

మరో మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందని, మంత్రి పదవి కాపాడుకునేందుకు, సీఎం జగన్ మెప్పు పొందడం కోసంబాగా రెచ్చిపోతున్నారన్నారు. ప్రజల చేతిలో వెల్లంపల్లికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. దేవుడి ఆస్తులు కబ్జాచేసిన పనికిమాలిన మంత్రి.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించుకోలేని మంత్రి.. జనసేన పార్టీ గురించి మాట్లాడతారా? అంటూ పోతిన మహేష్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై విమర్శించే స్థాయి నీదా అంటూ నిప్పులు చెరిగారు.

 వెల్లంపల్లి సినిమా .. పిచ్చ కామెడీ .. టైటిల్స్ ఇవే అంటూ తిట్ల దండకం

వెల్లంపల్లి సినిమా .. పిచ్చ కామెడీ .. టైటిల్స్ ఇవే అంటూ తిట్ల దండకం

వెల్లంపల్లి సినిమా తీస్తే కామెడీ బాగా పండుతుందని సెటైర్లు వేశారు. ఆ మూవీకి తామే టైటిల్ సూచిస్తుందని పేర్కొన్నా పోతిన మహేష్ మూడు కొబ్బరిచిప్పలు వారు కబ్జాలు, బందర్ రోడ్డు లో బూమ్ బూమ్, వన్ టౌన్ లో వేస్ట్ ఫెలో అనే పేర్లను సూచిస్తున్నామన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్న చరిత్ర మర్చిపోయావా అంటూ నిలదీశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖను భ్రష్టు పట్టించారు అని, 150 పైగా ఆలయాలపై దాడులు జరిగితే ఒక ఘటన అయినా విచారణ పూర్తి చేయలేని చేతగాని మంత్రి అంటూ పోతిన మహేష్ తీవ్ర విమర్శలు చేశారు .

జగన్ అరాచకాలు చూడలేక విజయమ్మ తెలంగాణాకు

జగన్ అరాచకాలు చూడలేక విజయమ్మ తెలంగాణాకు

ఇక జగన్ అరాచక పాలన చూడలేక ఆయన తల్లివిజయమ్మ తెలంగాణాకు వెళ్లిపోయారని పోతిన మహేష్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు విధిస్తూ ప్రజలను బాధపెడుతున్నారని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారు కూడా జగన్ దెబ్బకు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదని పోతిన మహేష్ జగన్ ను ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాన్ని తిట్టడానికి మాటలు కూడా రావడం లేదని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

క్రికెట్ బెట్టింగ్ మంత్రి నీటిపారుదల శాఖ మీద శ్రద్ధ పెట్టు .. పవన్ మీద కాదు

క్రికెట్ బెట్టింగ్ మంత్రి నీటిపారుదల శాఖ మీద శ్రద్ధ పెట్టు .. పవన్ మీద కాదు


అంతేకాదు ఆ పార్టీ నేతలు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నిప్పులు చెరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పై నీటి నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని, క్రికెట్ మ్యాచుల మీద పెట్టిన శ్రద్ధ నీటిపారుదల శాఖ మీద పెట్టి ఉంటే, పులిచింతల ప్రాజెక్ట్ గేట్ ధ్వంసం అయ్యేది కాదు అనే విషయం నో(నీ)టి పారుదల శాఖా మంత్రి గారు గమనిస్తారని కోరుకుంటున్నాం అంటూ సెటైర్లు వేశారు. నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పవన్ ను సంపూర్ణేష్ బాబుతో పోల్చి విమర్శలు గుప్పించారు. పవరూ లేదు స్టారూ లేడు అంటూ నిప్పులు చెరిగారు.

మంత్రి బొత్సాకు కౌంటర్ .. మీడియా ముఖ్యమంత్రి బొత్సా అంటూ


ఇక మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా కౌంటర్ వేసిన జనసేన పార్టీ ప్రజలందరూ ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, కరెంట్ చార్జీలు, పన్నులు తగ్గించమని, గుంతలు లేని రహదారులు కావాలని అడుగుతున్నారు, వాటిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మీడియా ముఖ్యమంత్రి బొత్సా గారుసూచనలు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకోవడం మంచిది కాదని చురకలు అంటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన బొత్సా సత్యన్నారాయణ వైసీపీ మంత్రులు సన్నాసులైతే పవన్ ఏమైనా రుషి పుంగవుడా అంటూ సెటైర్లు వేశారు. పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు.

ఏపీలో ప్రభుత్వ సినిమా టికెట్ల విక్రయాలపై పవన్ వ్యాఖ్యల దుమారం

ఏపీలో ప్రభుత్వ సినిమా టికెట్ల విక్రయాలపై పవన్ వ్యాఖ్యల దుమారం


నిర్మాతలు కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్లు అమ్ము కుంటాం అంటున్నారని, కష్టం మేము పడితే టికెట్లు మీరు అమ్ముకుంటారా అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ పై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇది వైసిపి రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అంటూ గుర్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.ఇదే సమయంలో వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. మా చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త అంటూ మండిపడ్డారు. మీరు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ మేం అడుక్కు తినాలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఏపీలో సినిమాలు విడుదల కాకూడదా అంటూ ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో పెద్దలు వైసీపీ నాయకులను మూసుకుని కూర్చోమని చెప్పలేరా? ఇండస్ట్రీ వంక చూడొద్దని చెప్పలేరా? మీకా ధైర్యం లేదా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.

English summary
Janasena leaders are countering YCP ministers who are making indecent remarks on Pawan Kalyan. Your history is ignited that everyone knows. Ministers Vellampally Srinivas, Anil Kumar Yadav and Botsa Satyanarayan are facing a reverse counter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X