జనసేనకు 90 సీట్లు .. పవన్ కళ్యాణ్ సీఎం .. హైపర్ ఆది షాకింగ్ కామెడీ
Recommended Video
జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి రావాలని అటు జనసైన్యమే కాదు జనసేన కోసం ప్రచారం చేసిన వారు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఏపీలో పర్యటించిన జబర్దస్త్ బృందం జనసేన పార్టీ మీద ఫుల్ క్రేజ్ తో మాట్లాడారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జనసేనపై చాలా పాజిటివ్ గా మాట్లాడారు . ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 90 అసెంబ్లీ సీట్లను గెలుపొందుతుందని హైపర్ ఆది జోస్యం చెప్పారు .
తాను జనసేన తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించే క్రమంలో ఏపీ వ్యాప్తంగా పర్యటించానని, ఆ సమయంలో ప్రజలంతా జనసేనకు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయినట్టు హైపర్ ఆది మీడియాతో చెప్పారు . ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు జనసేనతోనే సాధ్యం అని హైపర్ ఆది అన్నారు. పవన్ కళ్యాన్‌కు ప్రచారం చేసేందుకు ఏ ఏరియాకు వెళ్లినా కూడా ప్రజలలో మార్పు కావాలన్న బలమైన కాంక్ష కనిపించిందని ఆయన చెప్పారు .

తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నానని, అందుకు తగ్గ సీట్లు వస్తాయని, మొత్తంగా జనసేనకు 90 సీట్లు వస్తాయని తాను భావిస్తున్నట్టు హైపర్ ఆది చెప్పారు. ఆది చెప్పిన దాని ప్రకారం జనసేన ఏపీలో అధికారంలోకి వస్తుంది. కానీ ఒక పక్క టీడీపీ , మరో పక్క వైసీపీ అధికారం కోసం కలలు కంటుంటే జనసేన 90 స్థానాలు సాధిస్తాయని హైపర్ ఆది చెప్పటం అదిరిపోయే కామెడీ అంటున్నారు ఇది విన్న చాలా మంది . చూడాలి మరి ఏపీ ఎన్నికల ఫలితాలు జనసేనను ఏ స్థానంలో నిలబెడతాయో.












Click it and Unblock the Notifications