తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెవిరెడ్డి పై సీఎం కీలక నిర్ణయం - కేబినెట్ విస్తరణ వేళ : చిత్తూరులో కొత్త సమీకరణం..!!

|
Google Oneindia TeluguNews

కేబినెట్ ప్రక్షాళన వేళ..సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రి పదవుల కూర్పు పైన కసరత్తు చేస్తున్న సీఎం.. ఖచ్చితంగా ఈ సారి అవకాశం వస్తుందని ఆశించిన వారి విషయంలోనూ వేగంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి పదవులు దక్కే అవకాశం లేని వారికి పదవులు ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా.. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. మంత్రి పదవుల పైన కసరత్తు చేస్తున్న సమయంలో చెవిరెడ్డి క్యాంపు కార్యాలయానికి రావటంతో అనేక రకాలుగా ఆసక్తి కర చర్చలు తెర మీదకు వచ్చాయి.

చెవిరెడ్డికి మంత్రి పదవి కి నో ఛాన్స్

చెవిరెడ్డికి మంత్రి పదవి కి నో ఛాన్స్


ప్రస్తుతం చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి వర్గానికి చెందిన పెద్దిరెడ్డిని తప్పిస్తే..ఆ పదవి కోసం అదే జిల్లా నుంచి రోజా..చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. భూమన కరుణాకర రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు సీనియార్టీ అంశంతో పాటుగా సామాజిక సమీకరణాల కారణంగా ప్రస్తుత మంత్రుల్లో పది మంది వరకు కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో పెద్దిరెడ్డి పేరు సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలకు అదే జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కల్పించటం వీలు కాని పరిస్థితి. దీంతో..పార్టీ వ్యవహారాల్లో..ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డికి మరోసారి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా సమయం ఉన్నా.. ముందుగానే ఆర్డర్

ఇంకా సమయం ఉన్నా.. ముందుగానే ఆర్డర్

వాస్తవంగా ఈ పదివిలో చెవిరెడ్డి ఈ ఏడాది జూన్ వరకు కొనసాగనున్నారు. అయితే, కేబినెట్ విస్తరణ సమయంలో ఆయన కొనసాగింపుకు సంబంధించి ముందుగానే ప్రభుత్వం జీవో ఇచ్చింది. అందులో జూన్ 12వ తేదీ నుంచి..2024 జూన్ 12వ తేదీ వరకు చెవిరెడ్డి తుడా ఛైర్మన్ గా కొనసాగుతారని స్పష్టం చేసింది. చెవిరెడ్డి ఇప్పటికే విప్ గానూ కొనసాగుతున్నారు. ఇక, ఆయన తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్ అఫీషీయో సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. దీని ద్వారా.. పెద్దిరెడ్డి కొనసాగింపు ఖాయం కావటంతో..రెడ్డి వర్గానికి చెందిన వారికి ఎవరికీ కేబినెట్ లో ఛాన్స్ దక్కటం లేదనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఇతర వర్గాలకు చిత్తూరు నుంచి అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డితో పాటుగా ఎస్సీ వర్గానికి చెందిన నారాయణ స్వామి డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.

పెద్దిరెడ్డి కంటన్యూ...మరో బెర్తు దక్కేదెవరికి

పెద్దిరెడ్డి కంటన్యూ...మరో బెర్తు దక్కేదెవరికి

ఈ సారి చిత్తూరు నుంచి బీసీ లేదా బలిజ వర్గానికి కేబినెట్ లో స్థానం దక్కే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్ హయాం నుంచి ఆ కుటుంబంతో...జగన్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయనతోనూ చెవిరెడ్డి విధేయుడుగా..సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు..రెండో సారి విస్తరణలో కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందని అంచనా వేసారు. కానీ, ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో 2024 వరకూ చెవిరెడ్డికి మంత్రిగా అవకాశం లేనట్లే. దీంతో..చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ ద్వారా కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

English summary
CM Jagan decided to Extend the trnure of TUDA Chirman Chevireddy Bhaskar Reddy for two years more. At the cabinet reshuffle time this decision became hot topic in political cirlces
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X