పాకీ పనికి కుదిరితే అదే పని శాశ్వతం అవుతుంది .. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి జవహర్ పంచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది గత కొద్ది రోజులుగా టిడిపి నేతలకు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎస్సీలపై దాడుల విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్న క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎదురు దాడికి దిగుతున్నారు.ఇక నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలకు టిడిపి నాయకులు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జవహర్ నారాయణస్వామి సవాళ్ళను మానేసి తన శాఖను చూసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.

స్వామికి ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పని చేస్తున్నారన్న జవహర్
ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఇక సవాలు చేసి పాకీపనికి కుదిరితే అదే పని శాశ్వతం అవుతుందని మాజీ మంత్రి జవహర్ నారాయణ స్వామిని టార్గెట్ చేశారు. ముందు దళితులపై దాడులు సంగతి చూడు స్వామి.. తర్వాత మా సంగతి మాట్లాడుదువు గానీ అంటూ వ్యాఖ్యానించారు. మంత్రిగా తన పని తాను చెయ్యకుండా చంద్రబాబును విమర్శించటంపై వ్యంగ్యంగా స్పందించారు జవహర్. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడుతుందని జవహర్ పేర్కొన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు తమరు ఏం చేశారో చెప్పాలన్నారు.

చంద్రబాబును టార్గెట్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ ను ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా నిలబడి కనీసం రెండు సీట్లు గెలిచిన చంద్రబాబు ఇంట్లో శాశ్వతంగా పాకీపని చేయడానికి సిద్ధమని నారాయణ స్వామి సవాల్ విసిరారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి గెలిచే దమ్ము ధైర్యం లేవని విమర్శించారు. మిత్ర పక్షం పేరుతో బీజేపీతో ఒకమారు, వామపక్షాలతో, జనసేనతో ఒక్కోసారి ఒక్కో పార్టీతో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందని విమర్శించారు.

చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలవాలని నారాయణ స్వామి ఛాలెంజ్
చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని ఎద్దేవా చేశారు.ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్న డిప్యూటీ సీఎం కే నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళ కోసం తపన పడతారని, అదే సీఎం జగన్ మాత్రం లేని వాళ్ల కోసం తపన పడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఈరోజు ఎస్సీలపై లేనిపోని ప్రేమ ఒలక బోస్తున్నారని, అసలు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ఆయన ధ్వజమెత్తారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి రెడ్లకు మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు నారాయణ స్వామి. కనీసం ఒక ఎస్సీకైనా అవకాశం కల్పించారా అంటూ చంద్రబాబును నిలదీశారు.

చంద్రబాబుపై నారాయణ స్వామి ధ్వజం .. స్వామికి కౌంటర్ ఇస్తున్న టీడీపీ నేతలు
తాను అవినీతిపరుడనని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తనను తెలుగుదేశం పార్టీలోకి లాక్కోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఎంతో మంది ద్వారా తనతో చంద్రబాబు బేరసారాలు చేశాడని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదనే విషయాన్ని అప్పట్లోనే నిరూపించానని గుర్తుచేశారు నారాయణస్వామి. ఇక నారాయణ స్వామి వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు మాజీ మంత్రి జవహర్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications