టాక్: జయేంద్ర సరస్వతి మిస్సింగ్ మిస్టరీయే, జగన్‌తో ఫొటోలు హల్‌చల్
Recommended Video

హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని వివాదాలు చుట్టుముట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన బుధవారం శివైక్యం చెందారు. కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.
జయేంద్ర సరస్వతి 1987 ఆగస్టు 22వ తేదీన కంచి మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. మఠం నియమావళిని అనుసరించి అలా చేయడానికి వీలు లేదు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు.

ఇప్పటికీ అది మిస్టరీనే...
మఠం నుంచి జయేంద్ర సరస్వతి మాయం కావడం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అదృశ్యమైన జయేంద్ర సరస్వతి కోసం పోలీసులు గాలించారు. చివకు ఆయన కర్ణాటకలోని కూర్గులో గల తలకావేరి వద్ద కనిపించారు. ఆయన అలా ఎందుకు చేశారనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయంగానే ఉండిపోయింది.

రామజన్మ భూమి వివాదంపై ఇలా...
రామజన్మ భూమి వివాదాన్ని పరిష్కరంచడానికి మూడు పక్షాలు ఉండాలని, అందులో తనను ఓ వర్గంగా చేర్చాలని అప్పట్లో జయేంద్ర సరస్వతి అన్నారు. దాన్ని ఉత్తరాది స్వామీజీలు తప్పు పట్టారు. ఆయన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మఠాన్ని కలుషితం చేయడమేనని వారన్నారు.

చిన జీయర్ స్వామితో విభేదాలు...
జయేంద్ర సరస్వతికి చిన జీయర్ స్వామితో విభేదాలు పొడసూపాయి. జయేంద్ర సరస్వతికి తమిళనాడులోని అన్నాడియంకెతో, బిజెపితో సంబంధాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకించడం ద్వారా వివాదంలో చిక్కుకున్నారు.

వైఎస్ జగన్‌కు ఆశీస్సులు....
జయేంద్ర సరస్వతిని కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జగన్ 2016 ఆగస్టు 18వ తేదీన జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌కు జయేంద్ర సరస్వతి ఆశీస్సులు ఉన్నాయని చాటేందుకు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications