దామోదరకు జెసి కౌంటర్: సమైక్య గర్జనVsటి జనభేరీ

 JC counter to Damodara
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆదివారం కౌంటర్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. కిరణ్ సీల్డ్ కవర్ సిఎం అయితే.. సిఎం సిఫార్సుతో డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంపిక జరిగిందన్నారు.

సమైక్య గర్జనVsటి జనభేరీ

మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పార్లమెంటులో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతృత్వంలో తెలంగాణ జన భేరీ సభ జరుగుతుండగా, సమైక్యాంధ్ర కోసం కర్నూలు జిల్లాలో సమైక్య గర్జన జరుగుతోంది.

హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ జన భేరీ సభ జరుగుతోంది. ఈ సభకు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సిపిఐ(న్యూడెమోక్రసీ), ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

కర్నూలు సమైక్య గర్జనకు కూడా భారీ ఎత్తున సమైక్యవాదులు తరలి వచ్చారు. ఇరు సభల్లో సాంస్కృత కార్యక్రమాలు అలరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+