జేసీతో టీడీపీకి తలనొప్పి! రంగంలోకి సీఎం రమేశ్.. ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మైకులు పట్టుకుని పూనకం వచ్చినట్లు ఊగిపోవడం.. అధికారులపై అంతెత్తున లేచిపడటం.. అనంతపురం ఎంపీ జేసీకి ముందు నుంచి అలవాటే. వెటకారానికి కేరాఫ్ అన్నట్లు ఉండే ఆయన ప్రవర్తన.. కొన్నిసార్లు మరీ శృతి మించిపోవడం టీడీపీకి సైతం లేని తలనొప్పులు తీసుకొస్తోంది.

రెచ్చిపోయిన జేసీ: విశాఖ ఎయిర్ పోర్టులో రచ్చ.. ప్రింటర్ విసిరేసి!..

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో గురువారం నాడు ఆయన చేసిన రచ్చ ఏకంగా ఆయనపై నిషేధానికి దారితీయడంతో టీడీపీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఎలాగైనా ఈ వివాదం మరింత పెద్దది కాకుండా చూడాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆయనతో ఎలాగైనా క్షమాపణలు చెప్పించి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది.

సీఎం రమేశ్ జోక్యం:

సీఎం రమేశ్ జోక్యం:

ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ రంగంలోకి దిగారు. జేసీని బుజ్జగించి ఆయనతో క్షమాపణలు చెప్పించేందుకు అనంతపురంలోని ఆయన నివాసానికి వెళ్లారు. జాతీయ స్థాయిలో దీనిపై వివాదం చెలరేకముందే దీన్ని సద్దుమణిగించాలని చూస్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. జేసీ మాత్రం మీడియానే తన ప్రతిష్టను దిగజార్చిందంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జేసీ వ్యవహారం సిగ్గుచేటన్న గోహైన్:

జేసీ వ్యవహారం సిగ్గుచేటన్న గోహైన్:

జేసీ వ్యవహారంపై ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఆయన దాడికి పాల్పడటం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా వ్యవహరించాలని, కానీ జేసీ మాత్రం సెక్యూరిటీ నియమాలను ఉల్లంఘించారని అన్నారు.

కాగా, జేసీపై ఎయిర్ లూన్స్ నిషేధం ప్రకటించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్, జెట్ ఎయిర్ వేస్ లు సైతం జేసీపై నిషేధం విధించాయి.

అసలేం జరిగింది?:

అసలేం జరిగింది?:

గురువారం ఉదయం 7.30గం.కు ఎంపీ జేసీ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ లోకి వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55గం.కు బయలుదేరాల్సి ఉండగా.. అంతకు 45నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు ఇవ్వడం పూర్తి చేశారు. కానీ ఆలస్యంగా వెళ్లిన జేసీ.. బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందిగా అధికారులతో పేచీకి దిగారు.

అలా చేయడం నిబంధనలకు విరుద్దమని చెప్పినప్పటికీ.. తనతోనే రూల్స్ మాట్లాడుతారా? అంటూ ఫైర్ అయ్యారు. కౌంటర్ వద్ద ఉన్న ప్రింటర్ ను విసిరేయడంతో పాటు ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.

గజపతిరాజు జోక్యం:

గజపతిరాజు జోక్యం:

అధికారులు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి ససేమిరా అనడంతో.. అదే సమయంలో వీఐపీ లాంజ్ లో ఉన్న కేంద్రమంత్రి వద్దకు వెళ్లారు జేసీ. తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించాల్సిందిగా ఆయన్ను కోరడంతో.. అధికారులకు నచ్చజెప్పి పాస్ ఇప్పించారు.

అయితే ఇతర ప్రయాణికులు సైతం మాకెందుకు అలా ఇవ్వరంటూ పట్టుబట్టడంతో.. దీనిపై మరింత వివాదం మొదలైంది. ఎంపీలకు ఒక రూల్ తమకొక రూలా? అంటూ వారు ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం

ఇదిలా ఉంటే, గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో విమానయాన సంస్థలు ఎంత కఠినంగా వ్యవహరించాయో.. ఇప్పుడు జేసీ విషయంలోను అంతే కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapuram MP JC Diwakar Reddy has become a bigger headache to AP CM Chandrababu now. What Reddy had not bargained for was CCTV footage of the assault exposing him.
Please Wait while comments are loading...