తిట్టినందుకు షోకాజ్ అందిందన్న జెసి, 4 రోజుల్లో చెప్తా
హైదరాబాద్: తనకు షోకాజ్ నోటీసు అందిందని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేసినందుకు, వారిని తిట్టినందుకు పార్టీ అధిష్టానం తనకు నోటీసులు ఇచ్చిందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు.
తనకు వచ్చిన షోకాజ్ నోటీసులో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారని జెసి చెప్పారు. తాను నాలుగు రోజుల్లోనే స్పందిస్తానని తెలిపారు.
కాగా, రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సోనియా, రాహుల్‌ల పైన విమర్శలు చేశారు. సోనియా బాధ్యతల నుండి తప్పుకోవాలని జెసి డిమాండ్ చేశారు. జెసి వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో వేడిని రాజేశాయి. జెసి వ్యాఖ్యలపై ఇరు ప్రాంతాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెసి పైన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అధిష్టానానికి లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పలుమార్లు స్పందించారు. జెసికి నోటీసులు పంపించామని చెప్పారు. నిన్నటి వరకు తనకు నోటీసులు చేరలేదని చెప్పిన జెసి ఇప్పుడు వచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications