అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు.. జోస్యం చెప్పిన జేసీ

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. 130 స్థానాలు గెలుస్తాం నో డౌట్ అని చంద్రబాబు అంటే , ఆల్రెడీ విజయం డిసైడ్ అయ్యింది . ప్రమాణ స్వీకారానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాలి అని చెప్పారు జగన్ . ఇక తాజాగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పటం పక్కా అని జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమ్మవార్ల దయ చంద్రబాబుపై ఉంది .. టీడీపీ విజయం పక్కా .. జేసీ దివాకర్ రెడ్డి

అమ్మవార్ల దయ చంద్రబాబుపై ఉంది .. టీడీపీ విజయం పక్కా .. జేసీ దివాకర్ రెడ్డి

ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని, అంతేకాకుండా కేంద్రంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు . ఎన్నికల వేళ అమ్మవార్ల దయ చంద్రబాబు పై విశ్వసనీయంగా కనబడిందని, ఇక రాష్ట్రంలో టీడీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని జేసీ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గతం కంటే ఎక్కువ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకొంటుందని, అత్యధిక మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని ,చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో మరోసారి పాలనా పగ్గాలు చేపడుతుందని జేసీ వాఖ్యానించారు.

 పోలింగ్ రోజున అమ్మవార్లంతా వచ్చి బాబు కోసం ఓట్లేశారన్న జేసీ

పోలింగ్ రోజున అమ్మవార్లంతా వచ్చి బాబు కోసం ఓట్లేశారన్న జేసీ

పోలింగ్‌రోజు అమ్మవార్లంతా వచ్చి బాబు కోసం ఓట్లేశారు. వారి దయతో టీడీపీ నుండి పోటీలో ఉన్న నేతలు అంతా గెలిచేస్తున్నారు. అనంతపురం అర్బన్‌, శింగనమల, గుంతకల్లు అన్నీ గెలుస్తున్నాం. అనంతపురంలో ఓడిపోయే సీటు ఒక్కటీ లేదు. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు మావే అని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆయన కృషితో పాటు అదృష్టం కూడా తోడైందన్నారు జేసీ .

మహిళల రూపంలో అమ్మవార్లే వచ్చారన్న జేసీ

మహిళల రూపంలో అమ్మవార్లే వచ్చారన్న జేసీ

ఎన్నికలవేళ ఇబ్బందులకు గురయినప్పటికీ మహిళలు అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఓట్లేశారని, మహిళల రూపంలో అమ్మవార్లే వచ్చారని జేసీ అన్నారు . ఇది చంద్రబాబు మీద అభిమానం చాటిందన్నారు. రాష్ట్రంలోని వృద్ధులు కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేశారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా చంద్రబాబు ధాటికి ఎవరు కూడా ఎదురు నిలవలేరని అన్నారు. మొత్తానికి అమ్మవార్ల దయతో ఏపీలో టీడీపీ విజయం సాధిస్తుందని జేసీ జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+