మూటాముల్లె సర్దుకోవాల్సిందే: జెసి, రిజైన్‌కే: కోట్ల
హైదరాబాద్/ న్యూఢిల్లీ: మూటాముల్లె సర్దుకుని సొంత ఇంటికి వెళ్లిపోవాల్సిందేనని రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఎట్టి పరిస్థితిలోనూ ఆగదని, కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ఉందని ఆయన అన్నారు. శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసినా విభజన ఆగదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎవరినైనా మేనేజ్ చేస్తుందని, సుప్రీంకోర్టుకు వెళ్లినా విభజన ఆగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వేరే పార్టీల్లోకి వెళ్లి తాను పోటీ చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెసువాదినే అని ఆయన అన్నారు.

తాను తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి వెళ్లడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున కూడా పోటీ చేసేది లేదని ఆయన చెప్పారు. తాము అద్దె ఇంట్లో ఉన్నట్లు కేంద్రం స్పష్టంగా చెప్పిందని, వీలైనంత త్వరగా ఈ రాష్ట్రం సొంత ఇంటిలోకి వెళ్లాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
కాగా, తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని రాయలసీమకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. తాను రాజీనామా చేసి రెండు నెలలు కావొస్తోందని ఆయన అన్నారు. అప్పటి నుంచి విధులకు దూరంగానే ఉన్నానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications