వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JC Prabhakar Reddy: ఈడీ రూపంలో దేవుడు- వాళ్లూ ఇరుక్కుంటారు.!!

|
Google Oneindia TeluguNews

JC Prabhakar Reddy on ED Attachement: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసారు. రూ 38 కోట్ల మేర అక్రమ లావాదేవీలు లారీల పేరుతో జరిపినట్లు ఈడీ నిర్దారించింది. ఈడీ తాజా నిర్ణయాల పైన ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తనకు ఈడీ రూపంలోనే దేవుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. ఈడీ తీసుకున్న నిర్ణయం తో తనకు సంతోషంగా ఉందన్నారు. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.

ఈడీ తన ఆస్తులను ఎటాచ్ చేయటం పైన స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఇదీ మంచి అవకాశంగా అభివర్ణించారు. ఇందులో అసలు మాకు వాహనాలు అమ్మిన ఆశోక్ ల్తెలాండ్ ని ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ఇందులో రూ.38 కోట్లు స్కాం అంటున్నారని,,. తొందరలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

ఎవరి పాత్ర ఏమింటో అని విషయాలు త్వరలో బయటకు వస్తాయని పేర్కొన్నారు. తమకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ ని విచారణ చేయాలన్నారు. నాగాలాండ్ అధికారులను ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసారు.ఈ కేసులో ఆర్టీఓ, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ గా జేసీ వెల్లడించారు.

JC Prabhakar Reddy Interesting comments on ED Attachments of his properties

ఈ కేసులో జేసీ ప్రభాకర రెడ్డితో పాటుగా ఆయన సన్నిహిత కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డితో పాటుగా కుటుంబ సభ్యులకు చెందిన రూ 22.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అందులో రూ 6.31 కోట్ల విలువైన చరాస్తులు.. రూ 15.79 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దివాకర్ రెడ్డి లైన్స్, జటధార ఇండస్ట్రీస్, సీ గోపాల్ రెడ్డి అండ్ కో పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.

బీఎస్ 4 ప్రమాణాలు పాటించని వాహనాలను 2017 ఏప్రిల్1 తరువాత విక్రయించటానికి వీల్లేదని..రిజిస్ట్రేషన్ చేయద్దని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, గోపాల్ రెడ్డి వాటిని తుక్కు కింద కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించటం పైన మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి తమకు విక్రయించిన అశోక్ లే లాండ్ పైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
TDP Senior leader JC PRabhakar Reddy reacted on ED Attahched properties in money laundering case, he invited the ED Decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X