చంద్రబాబు..గుర్తు పెట్టుకోండి : కాల్వ మరో నేత నాశనం చేస్తున్నారు : జేసీ సంచలనం..!!

అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితి పైన ఆ పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జిల్లాలోని సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులతో పాటుగా మరో నేత కారణంగా పార్టీ జిల్లాలో నాశనం అవుతుందని తీవ్ర ఆరోపణలు చేసారు. వారి పేర్లు పార్టీ సమావేశంలో బయట పెడతానని హెచ్చరించారు. రాయలసీమ టీడీపీ నేతల సమావేశం ఈ రోజు అనంతపురం లో ఏర్పాటు చేసారు. హంద్రీనీవాతో పాటుగా సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చిందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు.

అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్

అనంత టీడీపీ నేతలపై జేసీ ఫైర్

అయితే, దీని పైన జేసీ ప్రభాకర్ రెడ్డి తన మార్కు డైలాగులతో విరుచుకుపడ్డారు. సినిమా టిక్కెట్ల విషయం లో ప్రభుత్వం తమ నియంత్రణలోకి తెస్తూ నిర్ణయిస్తే అడిగే వాడే లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ పార్టీ నేతలు చేసేదే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అంటూ ఫైర్ అయ్యారు. ముందుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తించాలని డిమాండ్ చేసారు. కొలువు లేని రాజకీయ నేతలు ఈ నీటి ప్రాజెక్టుల పేరుతో తిరుగుతూ ఉంటారని ఎద్దేవా చేసారు. లోకేశ్ పరామర్శలకు వెళితేనే లోపల వేస్తున్నారని..వీరిని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.

కార్యకర్తలను ఎప్పుడైనా పట్టించుకున్నారా

కార్యకర్తలను ఎప్పుడైనా పట్టించుకున్నారా

ఈ నేతలు ఎవరికి సమాచారం ఇచ్చారు... ఒక నేతనైనా పిలిచారా..నిజమైన కార్యకర్తలకు సమాచారం ఇచ్చారా అంటూ నిలదీసారు. టీడీపీకి బలమైన అనంతపురం జిల్లాలో కాల్వ శ్రీనివాసులుతో సహా.. మరో నేత కలిసి పార్టీని నాశనం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారెవరూ కార్యకర్తలను పట్టించుకున్న రోజు లేదంటూ మండిపడ్డారు. కార్యకర్తల సమావేశం నిర్వహించాలని జేసీ డిమాండ్ చేసారు.కార్యకర్తలను ఏ నేత సరిగ్గా చూసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తామంతా కార్యకర్తల వలనే నేతలమయ్యామని వివరించారు. అనంతపురం జిల్లాలోనే నేతలందరినీ మార్చాల్సిందేనని జేసీ డిమాండ్ చేసారు.

జిల్లాలో నేతలందరినీ మార్చేయండి

జిల్లాలో నేతలందరినీ మార్చేయండి

చంద్రబాబు మీరు గుర్తు పెట్టుకోండి...ఈ నేతల వలన జిల్లాలో పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదంటూ జేసీ తేల్చి చెప్పారు. ఈ నేతలకు ఏదీ చేతకాదని..అందరూ మాత్రం వారికి మద్దతుగా నిలబడాలంటారని చురకలు వేసారు. పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో ఏ అభ్యర్దికి అయినా ఈ నేతలు వచ్చి మద్దతుగా నిలబడ్డారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏ నేత కనిపించ లేదని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను పట్టించుకుంటనే మనుగడ సాధ్యమనేది గుర్తించాలని పార్టీ అధినేతకు జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.

టీడీపీలో జేసీ వ్యాఖ్యల కలకలం

టీడీపీలో జేసీ వ్యాఖ్యల కలకలం

పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే తాను అన్ని విషయాలు.. అందరి పేర్లు వివరిస్తానని జేసీ స్పష్టం చేసారు. జేసీ వ్యాఖ్యలు ఇప్పుుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అనంత జిల్లాలో 2019 లో టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితం అయింది. ఇప్పుడు జిల్లాలోని సీనియర్లు అంతా కలిసి కార్యక్రమం ప్లాన్ చేస్తే..జేసీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పడు పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. దీని పైన టీడీపీ అధినాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+