టిపై కాంగ్రెస్ వెనక్కి పోదు కానీ హైదరాబాదే: జెడి శీలం

వెంటనే బిల్లు పెట్టాలి: దేవీప్రసాద్
కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. ఆయన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సకల జన భేరీ సభలో మాట్లాడారు. ఆంక్షలు, నిషేధాలు లేని మొదటి తెలంగాణ సభ ఇదే అన్నారు.
తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె పైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ విషయంలో నాన్చివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. వెంటనే సభలో బిల్లు పెట్టాలన్నారు.
సమ్మె ఎందుకు చేస్తున్నారో ఎపిఎన్జీవోలు చెప్పలేకపోతున్నారని, సమ్మె చేస్తున్న వారి సమస్యల గురించి అడిగామని చెప్పారు. అన్నిచోట్ల జరిగినట్లే ఇక్కడ కూడా విభజన జరుగుతోందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల కుట్ర అని ఆరోపించారు. సమైక్యాంధ్ర సమ్మె వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications