వైసీపీ లో చేరగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన జీవితా రాజశేఖర్

ఎన్నికల సమయంలో ఏపీలో ఇంకా ప్రధాన పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జగన్ పార్టీలోకి చాలా మంది పేరు పొందిన సినీ నటులు వచ్చి చేరుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రముఖ హీరో రాజశేఖర్ మరియు అతని భార్య జీవిత రాజశేఖర్ లు చేరిపోయారు.కేవలం వీరు మాత్రమే కాకుండా మరో సినీ నటి హేమ మరియు యాంకర్ శ్యామల కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .

సొంత గూటికి చేరిన జీవితా రాజశేఖర్ .. జగన్ కు మాకు ఎలాంటి గొడవలు లేవు

సొంత గూటికి చేరిన జీవితా రాజశేఖర్ .. జగన్ కు మాకు ఎలాంటి గొడవలు లేవు

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసిన జీవిత, రాజశేఖర్‌ వైసీపీ లో చేరారు . జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గతంలో వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రమే ఉన్నాయని అవి కాస్త నేటి చేరికతో తొలగిపోయాయని చెప్పారు రాజశేఖర్ . వైసీపీలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని చెప్పిన రాజశేఖర్ దంపతులు పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. అప్పట్లో తానే అపరిపక్వతతో ప్రవర్తించానని జగన్ తో తమకు శత్రుత్వం లేదు అని అన్నారు. అయితే అవి తొలగించుకోవడానికే తాను ఈరోజు లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి పార్టీ లో చేరానన్నారు రాజశేఖర్ .

పార్టీలో చేరగానే పవన్ వ్యాఖ్యలపై జీవిత సంచలనం

పార్టీలో చేరగానే పవన్ వ్యాఖ్యలపై జీవిత సంచలనం

ఇక పార్టీ లో చేరటంతోనే చీరలకు , డబ్బులకు లొంగకుండా రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ను గెలిపించుకోవాలని జీవితా రాజశేఖర్ పిలుపునిచ్చారు. వైసీపీలో చేరిన అనంతరం జీవితా రాజశేఖర్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు .తాము పవన్ కళ్యాణ్ ను కావాలని ఎప్పుడు అటాక్ చెయ్యమని కానీ ఈ మధ్య పవన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారిని మరియు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొడుతున్నారని పవన్ చెప్పటం కరెక్ట్ కాదన్న జీవిత ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏం లేవని అలాంటి మాటలు మాట్లాడ్డం తప్పని అన్నారు.

కావాలని టార్గెట్ చెయ్యం .. ఒకవేళ అవసరం అయితే తప్పక స్పందిస్తాం

పవన్ వ్యాఖ్యలతో తెలంగాణలో ఉన్న వారిని అనవసరంగా కొట్టుకునేలా తీసుకురావద్దని నేను కోరుకుంటున్నానని రాజశేఖర్ తెలిపారు.అలాగే జీవిత మాట్లాడుతూ తాము ఎవరినీ కావాలని టార్గెట్ చెయ్యదలచుకోలేదని ఒకవేళ అలాంటి పరిస్థితులు గాని వస్తే తప్పక మాట్లాడతామని చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రజలు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలన్న జీవితా రాజశేఖర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తాం అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+