ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏటా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు (మార్చి 19, 2026) జాబ్ క్యాలెండర్ విడుదల చేయటానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. కాగా ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
ఈ జాబ్ క్యాలెండర్ లో పలు శాఖలకు సంబంధించి 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా 25 శాఖలలో ఈ నియమకాలను పూరించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు సైతం ప్రకటించేలా అధికారులు కసరత్తు చేపట్టారు.

మరోవైపు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు గానూ పాఠశాల విద్యాశాఖ.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే మూడేళ్ల కాలానికి ప్రకటించబోయే డీఎస్సీలపైనా ప్రణాళిక సిద్దం అవుతోంది. రానున్న కాలంలో వరుస డీఎస్సీల ద్వారా సుమారు 7,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు.
ఏ శాఖలో ఎన్ని పోస్టులు? ఎప్పుడు నోటిఫికేషన్?
ప్రభుత్వం ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం..
మే 15: ఉన్నత విద్యా విభాగంలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్.
ఆగస్టు 15: హోంశాఖలో 2,778 పోస్టులు, ఇతర శాఖల్లో 928 పోస్టులు, 91 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు.
సెప్టెంబర్ 15: గ్రూప్-2 కేటగిరీలో 750 పోస్టులకు నోటిఫికేషన్.
అక్టోబర్ 15: విద్యాశాఖలో 3,004 పోస్టులకు నోటిఫికేషన్.
మంత్రి నారా లోకేష్ పోస్ట్..
ఈ మేరకు ఎక్స్ వేదికగా నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. అందులో.. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ ఏటా ఉగాదికి ఉద్యోగాల పండుగ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు సిద్ధం కావడానికి వీలుగా సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులందరూ స్కిల్ పోర్టల్ నందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అలర్ట్స్ నేరుగా అభ్యర్థులకు అందుతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది.. ఇక మీ వంతు, పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి అంటూ మంత్రి లోకేష్ యువతకు పిలుపునిచ్చారు. అలానే ఉగ్యోగార్థులందరికీ "ఉగాది" శుభాకాంక్షలు తెలిపారు.
#APJobCalender2026
— Lokesh Nara (@naralokesh) March 19, 2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి… pic.twitter.com/CvTOyZK4bz
-
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
AP KGBV Admissions: కేజీబీవీల్లో అడ్మిషన్ల గడువు పెంపు-పూర్తి వివరాలివే..! -
India Post GDS 2026 2nd Merit List: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఖరారు..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications