మార్కెట్ లో కాసులు కురిపిస్తున్న ఈ పనుల ముందు ఉద్యోగాలు వేస్ట్!!

చాలామంది డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే చాలు జీవితంలో సెటిల్ అయిపోతుందని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న వాళ్ళు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే జాబ్ కోసం నిరీక్షణ వేస్ట్ అని తాజాగా ఉన్న అనేక పనులు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రైవేటు ఉద్యోగమైనా మనకంటూ స్వేచ్ఛ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కానీ సొంతంగా పని చేసుకోగలిగిన టెక్నికల్ వర్క్స్ నేర్చుకుంటే అది మన భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. కాసుల వర్షం కురిపిస్తుంది. మనకు అనుకూలమైన సమయంలోనే పని చేసుకునే మంచి బిజినెస్ గా మారుతుంది.

Jobs are waste in front of these hand works which are in full demand in the market

ప్రస్తుతం మార్కెట్లో గృహ నిర్మాణాలకు సంబంధించిన అనేక పనులు ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి. ప్లంబర్, ఇంటీరియర్ డెకరేటర్, వుడ్ వర్క్స్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్ పనులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎక్కడైనా ఏదైనా ఇంట్లో కుళాయిలు లీక్ అయినా, చిన్నచిన్న రిపేర్ లు ఉన్నా ప్లంబర్ ని పిలిస్తే మినిమం 500 నుంచి 1000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే.

ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, ఇంటీరియర్ డెకరేటర్స్, వుడ్ వర్క్స్ చేసే వాళ్ళ డిమాండ్ అయితే అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ పనులు చేసేవారు తక్కువగా ఉండటం వల్ల, వారికి ఎక్కువ డిమాండ్ ఉంది. నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా హ్యాండ్ వర్క్ వచ్చినవారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.

ఇక కొత్తగా కట్టే ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనాలు, ఇప్పటికే కట్టిన ఇళ్ళలో ఉండే రిపేర్లు.. ఇక వారికి ఎప్పటికీ పని ఉంటుంది. ఇక ఈ వృత్తులు చేస్తూ కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి షర్టు నలగని ఉద్యోగమే చేయాలని భీష్మించుకు కూర్చోక డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఇటువంటి ఉపాధి మార్గాలను ఎంచుకోవచ్చు.

ఇంత చదువు చదువుకొని ఇటువంటి పనులు చేస్తామా అని ఈగోలకు పోకుండా ఈ వృత్తులపై కాన్సంట్రేట్ చేస్తే మంచిదని చెప్పొచ్చు. డబ్బు సంపాదించడం కోసమే ఉద్యోగం చెయ్యాలి అనుకునేవారు, ఉద్యోగాల విషయంలో నిరాశకు గురికాకుండా, ఇటువంటి ఉపాధి మార్గాలను ఎంచుకుంటే బాగా సెటిల్ అవ్వచ్చు అని తాజా మార్కెట్ డిమాండ్ చెబుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+