దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేశ్ సత్య ప్రమాణం..!! (వీడియో)

ఏపీ రాజకీయాలు ప్రమాణాల వైపు తిరిగాయి. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి.. వైసీపీ నేత జోగి రమేష్ సత్య ప్రమాణం చేసారు. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ చెప్పినట్లుగానే చేసానంటూ నిందితులు ఇచ్చిన సమాచారం సంచలనంగా మారింది. దీంతో, జోగి రమేష్ పాత్ర పైన విచారణ సాగుతోంది. కాగా.. రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని.. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జోగి రమేష్ చెబుతున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆలయంలో సత్య ప్రమాణం చేసారు.

కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ నేత.. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేయటం సంచలనంగా మారుతోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్‌ రోడ్డు ఎంట్రెన్స్‌ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని జోగి రమేష్ స్పష్టం చేసారు. కల్తీ మద్యం పేరుతో తన హృదయం గాయ పరిచారని..తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు.

jogi-ramesh-swore-at-the-durga-temple-that-he-was-not-involved-in-the-adulterated-liquor-case

అమ్మ వారి సాక్షిగా చెబుతున్నానని.. తాను ఏ తప్పు చేయలేదు, చేయనని జోగి చెప్పుకొచ్చారు. తన వ్యక్తిత్వంపై నింద వేశారని..తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారని పేర్కొన్నారు. అందుకే కుటుంబంతో సహా వచ్చానని..తాను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానని చెప్పారు.

తన కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నట్లు వివరించారు. తాను ఏ తప్పు చేయను చేయలేదని పునరుద్ఘాటించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి తాను సిద్ధమని చెప్పానని... ఆ సవాలకు కట్టుబడి తాను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానన్నారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధమని జోగి రమేష్ వెల్లడించారు.

నకిలీ మద్యం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జోగి.. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. తన పై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా అంటూ నిదీతాసరు. పోనీ.. లైడిటెక్టర్‌ టెస్టుకైనా వస్తారా అంటూ..కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలని జోగి రమేష్‌ మరోమారు సవాల్‌ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+