ఓటింగ్ జరగాల్సిందే: ఢిల్లీపై జెపి ఆగ్రహం, బాబుకు హామీ
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఓటింగ్ జరగాల్సిందేనని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం అన్నారు. ఓటింగ్ జరిగినప్పుడే సభ్యుల అభిప్రాయం తెలుస్తుందని చెప్పారు. బిల్లు పైన ఓటింగ్ జరపాలనేదే తమ అభిప్రాయమన్నారు.
గతంలో కూడా ఓటింగ్ జరిగిందని చెప్పారు. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అసెంబ్లీకి బిల్లును పంపించడమెందుకని ప్రశ్నించారు. సభ అభిప్రాయం కోసమే రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపించారని కాబట్టి ఓటింగ్ జరిగితేనే తెలుస్తుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపికి మద్దతిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబుకు జెపి హామీ
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. అందుకు జెపి అంగీకరించారు.
కెకెకు సిపిఐ మద్దతు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కె కేశవ రావుకు సిపిఐ మద్దతు పలికింది. కెకె రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాగా, కెకెను మంత్రి జానా రెడ్డి అభినందించారు. కెకె మద్దతు కోరితే స్పందిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కెకెకు అందరు మద్దతు పలకాలన్నారు. బిజెపి, మజ్లిస్ పార్టీలను కలుస్తామని చెప్పారు.
కిరణ్ కుస్పష్టత లేదు
రాష్ట్రపతి పంపించిన తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టత లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు వేరుగా మండిపడ్డారు. ఓ వైపు తిప్పి పంపాలంటూ మరోవైపు గడువు పెంచాలని కోరడమేమిటిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications