కుట్ర: విభజనపై జెపి, రేపు వ్యూహం: అశోక్ బాబు

విభజన నిర్ణయంతో కోస్తాంధ్ర గుండెకు గాయమైందని ఆయన అన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను శానససభలో వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన అంశంపై అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని రాష్ట్రపతి, శానససభ స్పీకర్‌లకు పంపిస్తామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు చెప్పారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై రాజకీయ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అసెంబ్లీ లోపల, వెలుపల ఎటువంటి వ్యూహాలు అనుసరించాలో శనివారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సమ్మె అనివార్యమైతే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విభజన ఎందుకు చేయకూడదనే విషయంపై శాసనసభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications