రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి క్లీంకారకు జూనియర్ ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్!!

చిరంజీవి ఫ్యామిలీకి జూన్ నెల ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగా ప్రిన్సెస్ క్లీంకార సందడి చేస్తుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీన ఒక బిడ్డకు జన్మనిచ్చారు . 11 సంవత్సరాల తరువాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, మెగా అభిమానులు సంతోషంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడం తోపాటుగా, తమ ప్రేమను వ్యక్తం చేయడానికి అద్భుతమైన బహుమానాలను పంపుతున్న విషయం కూడా తెలిసిందే. ఇక తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారకు ఒక అద్భుతమైన బహుమానాన్ని పంపినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ramcharanjrntr1

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య ఒక అద్భుతమైన స్నేహబంధం ఉంది. ఆర్ ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ స్నేహబంధం మరింత పెరిగింది. వీరిద్దరూ ఎక్కడ వేదిక మీద ఉన్నా వీరి స్నేహాన్ని తెలియజేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మీరు ఇరువురి మధ్యనే కాకుండా ఇరు కుటుంబాల మధ్య కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఉపాసన ముద్దుల పట్టి క్లీంకారకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారని తెలుస్తుంది.క్లీంకార కోసం రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార ముగ్గురు పేర్లతో ఉన్న బంగారు డాలర్స్ ను డిజైన్ చేసి బహుమతిగా పంపారని తెలుస్తుంది. అయితే ఈ బహుమానాన్ని కూడా తారక్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ రామ్ లు ఎంతో ఇష్టంగా అందించినట్టు సమాచారం.

క్లీంకార పుట్టినప్పటి నుండి ఫ్యాన్స్ మెగా ప్రిన్సెస్ విషయంలో తమ సంతోషాన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త కూడా వైరల్ అవుతుంది.ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న మంచి స్నేహబంధం నేపథ్యంలో ఇది నిజమే అయి ఉండొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+