వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తుల జప్తు సబబే'

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు వైయస్ జగన్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లకు చెందిన రూ. 863 కోట్ల ఆస్తుల జప్తు సబబే అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయ ప్రాధికార సంస్థ తీర్పు నిచ్చింది.

వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డకు చెందిన రూ.863 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగతి పబ్లికేషన్స్ చెందిన షేర్లు, ఫ్లాంట్స్, మిషనరీలకు సంబంధించి రూ.365.45కోట్లు, రూ.4.14 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది.

Jagan - nimmagadda

దాంతో పాటు ఇందిరా టెలివిజన్‌కు చెందిన షేర్లు రూ.100.44 కోట్లు, సండూర్ పవర్ కంపెనీ ఆస్తులు రూ.57 కోట్లు, సండూర్ పవర్ పబ్లిక్ లిమిటెడ్ రూ.35 కోట్లు, జగన్ ఆస్తులు రూ.11 కోట్లను ఈడీ జప్తు చేసింది.

అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన ఆల్పా ఎవెన్యూ ఆస్తులు రూ. 97.81 కోట్లు, ఆల్పా విల్లాస్‌కు చెందిన ఆస్తులు రూ. 35.89 కోట్లు, జీ-2 కార్పొరేట్ సర్వీస్ రూ. 44.20 కోట్లు జప్తు చేసింది. అలాగే వాన్‌పిక్ పోర్టు లిమిటెడ్ చెందిన 561.20 ఎకరాలు, వాన్‌పిక్ ప్రాజెక్టు లిమిటెడ్ 855.71 ఎకరాలను ఈడీ జప్తు చేసింది.

English summary
Judicial authority of Enforcement directorate has supported the attachement of YSR Congress party president YS Jagan and Nimmagadda Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X