దూసుకెళుతున్న 3 షేర్లు.. నో స్టాప్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండంతోపాటు కొన్ని ప్రధానమైన రంగాల్లో కొనుగోళ్ల వల్ల భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 361 పాయింట్ల లాభంతో 63 వేల 90 మార్క్ వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 108 పాయింట్లు లాభపడి 18 వేల 709 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, ఎస్ బీఐ, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మూడు కంపెనీల షేర్లు మాత్రం దూసుకువెళుతున్నాయి. పెట్టుబడిదారులకు మంచి లాభాలనందిస్తూ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. వాటిగురించి తెలుసుకుందాం..
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) : ట్రేడింగ్ ప్రారంభమైన కొంచెం సేపటికే 2 శాతం పెరిగింది. ఈ కంపెనీ ఇనుప గనులు దక్కించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా షేర్లు రాణిస్తున్నాయి.
9.77 ఎంఎంటీ, 65.73ఎంఎంటీ కలిగిన రెండు ఐరన్ ఓర్స్ జేఎస్ డబ్ల్యూ కి దక్కాయి. క్ 6 నుంచి 96.65 శాతం మినరల్స్, బ్లాక్ 9 నుంచి 109.80 శాతం మినరల్స్ వెలికి తీయనున్నారు.

హెచ్ఎఫ్‌సీఎల్ (HFCL) : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ హెచ్ఎఫ్ సీఎల్ కి రూ.80.92 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేస్ 4లో భాగంంగా ముఖ్యమైన మూడు కారిడార్లలో ఫైబర్ ఆప్టిక్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయనున్నారు. నోటిఫికేషన్ జారీచేసిన 156 వారాల్లోపు దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా దూసుకువెళ్లాయి.
ఇంజినీర్స్ ఇండియా (Engineers India) : ఓఎన్‌జీసీ నుంచి ఈ కంపెనీకి రూ.472 కోట్లు విలువైన ఆర్డర్ లభించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్ 2 శాతం మేర పెరిగింది. సీఎస్‌యూ ఆఫ్ గ్యాస్ కంప్రెషర్స్, రీజనరేషన్ గ్యాస్ కంప్రెషర్స్ రీప్లేస్ చేయనుంది. అలాగే ఉరాన్ ప్లాంట్‌లో సీబీడీ వెసెల్ ఇన్‌స్టాల్ చేయనున్నారు. 40 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.












Click it and Unblock the Notifications