Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు వేళ ..ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం

స్కిల్ డెవెలెప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాయి.స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌లో వందల కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని..వాటి లెక్కలు చూపకపోవడంతో.. చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు.

పోలీసులు ఆయన ప్రయాణించే మార్గాల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబం చంద్రబాబు అరెస్ట్‌ను ముక్త కంఠంతో ఖండించింది. అయితే ఒక్క హరికృష్ణ కుటుంబం తప్ప.చంద్రబాబు అరెస్ట్‌పై హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్ ,జునియర్ ఎన్టీఆర్ కాని స్పందించ లేదు.

Chandrababu Arrest

రాజకీయాల కోసం కాకపోయిన..కుటుంబం కోసం అయిన వారు స్పందిస్తారని చాలామంది అతృతుగా ఎదురు చూశారు. కాని కల్యాణ్ రామ్ కాని,జునియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడలేదు. దీంతో టీడీపీ శ్రేణులు జునియర్ ఎన్టీఆర్‌పై మండిపడుతున్నారు. కుటుంబ సభ్యుడు కష్టాల్లో ఉంటే కనీసం స్పందిండానికి ఏమైందంటూ వారు ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జునియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలియడం ఆసక్తిగా మారింది.

Chandrababu Arrest

ఈ ఫ్లెక్సీలో నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత శోభకు గురిచేసి.. నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు..నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నాడు. నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా కుటిల రాజకీయానికి వాడుకున్నాడు. నా మనుమడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయాన్ని కోసం వాడుకున్నాడు. ఈ నీచుడికి బుద్ధి చెప్పి.. నా ఆత్మకు శాంతి చేకూర్చావ్ .. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకెళ్తున్న సందర్భంగా.. తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆత్మ శాంతి దినోత్సవం గా జరుపుకోవాలని నా విజ్ఞప్తి.. అంటూ మీ నందమూరి తారక రామారావు పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి.

Chandrababu Arrest

జునియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ కలిసి సీఎం జగన్‌కు అభినందనలు తెలుపుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.అయితే జునియర్ ఎన్టీఆర్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీ వైసీపీ నేతలు కట్టినట్టుగా స్పష్టం అవుతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఫొటో ఈ ఫ్లెక్సీలో దర్శనం ఇచ్చింది. దాంతో ఇది వైసీపీ నేతల పనే అని అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+