పవన్ సినిమాల్లోనే హీరో..నేను ప్రపంచానికే హీరోను .. 7 యుద్ధాలు ఆపాను .. పాల్ కామెడీ
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టిస్తున్నారు . ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేస్తున్న కేఏ పాల్ దృష్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై పడింది. మొన్నటికి మొన్న తనకు వైసీపీ నేతల నుండి ప్రాణహాని ఉందని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని కోరిన కేఏ పాల్ తాజాగా పవన్ కళ్యాణ్ పై మాటల తూటాలు పేల్చారు. పవన్ ను మించి తానూ ప్రపంచానికే హీరో అని చెప్పి కామెడీ పండించారు .

జనసేన అధినేత పవన్ టార్గెట్ గా కేఏ పాల్ సంచలనం
ప్రజా శాంతి పార్టీ అద్యక్ష్యుడు కేఏ పాల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . సినీ నటులైన పవన్ కి మరియు నాగబాబు కి ఓట్లు వేయడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట పవన్ కళ్యాన్ కు సీఎం అయ్యేంత చరిష్మా ఉందని తనతో సహకరిస్తే పవన్ ను సీఎం చేస్తా అన్న నోటితోనే అసలు పవన్ కు ఎందుకు ఓటెయ్యాలి అని ప్రశ్నిస్తున్నారు కేఏ పాల్ .

మాయావతి కాళ్ళు మొక్కాడని వోట్లు వెయ్యాలా అని ప్రశ్నించిన పాల్
కేవలం మాయావతి కాళ్ళు మొక్కాడని వారికీ ఓటు వేయాలా అని పాల్ ప్రజలను ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, నాగబాబులు కేవలం సినిమాల్లోనే హీరోలని, నేను ప్రపంచానికే హీరోను అని పాల్ అన్నారు. నేను ప్రపంచ హీరోను అంటూ తన హీరోయిజం గురించి చాలా గొప్పలు చెప్పుకొచ్చారు పాల్ .

ఏడు యుద్ధాలు ఆపానన్న పాల్ .. డాన్స్ అయినా ఏదైనా పవన్ కంటే బాగా చేస్తానన్న పాల్
ఏడు యుద్ధాలు ఆపాను. నిజం చెప్పాలంటే, నేను నేచురల్ డ్యాన్స్ చేస్తాను. వాళ్ల కంటే బాగా వేయగలను. రమ్మనమనండి, డ్యాన్స్, రన్నింగ్, డిబేట్ కాంపిటీషన్ కు దేనికైనా సరే నేను రెడీ అని ఛాలెంజ్ విసిరారు.డబ్బు తీసుకురావడానికి, సంపాదించడానికి, ఏ పని అయినా చేయడానికి వాళ్లు తనతో పోటీపడగలరా? అసలు, వాళ్లు ఏం చేయగలరు? అంటూ పవన్ కళ్యాణ్, నాగబాబులపై విరుచుకు పడ్డారు కేఏ పాల్ .












Click it and Unblock the Notifications