వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకీ, ఎన్డీయే కూటమికీ మధ్య పోరు సాగుతుంటే కడపలో మాత్రం వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు నెలకొంది. దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి, తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను అజెండాగా చేసుకుని కడప లోక్ సభ సీటులో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటమే. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ తో పాటు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ వీరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల, సునీతతో పాటు ఇతర రాజకీయ నేతలు కూడా వివేకా హత్యపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కడప కోర్టు ఇవాళ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ వైఎస్ షర్మిల, సునీతారెడ్డితో పాటు రాష్ట్రస్ధాయి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి సైతం కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కడప లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలతో పాటు సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి వివేకా హత్యపై నిత్యం మాట్లాడుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు దర్యాప్తులో ఉన్న కేసును వాడుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కడప కోర్టు.. విపక్ష నేతల్ని వివేకా హత్య కేసుపై మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications